వినోదానికే కాదు రాజకీయాలకు కూడా అడ్డాగా మారానున్న టిక్ టాక్

ఇప్పటివరకు టిక్ టాక్ అంటే వినోద భరిత వీడియో లు రికార్డ్ చేసి ఎవరికీ వారు తమ టాలెంట్ ను బయటపెడుతున్న విషయం తెలిసిందే.

ఈ టిక్ టాక్ వీడియో లు చేస్తూ ఎందరో తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నప్పటికీ ఈ టిక్ టాక్ పిచ్చి మాత్రం జనాల్లో ఏమాత్రం తగ్గడం లేదు.

అయితే ఇప్పటివరకు కేవలం వినోదం కోసం మాత్రమే అనుకుంటున్న ఈ టిక్ టాక్ ఇప్పుడు రాజకీయాలకు కూడా అడ్డాగా మారనున్నట్లు తెలుస్తుంది.దీనికి ప్రధాన కారణం మజ్లీస్ పార్టీ ఎం ఐ ఎం అఫీషియల్ గా టిక్ టాక్ ఖాతా తెరచించింది.

ఇప్పటివరకు పేస్ బుక్,ట్విట్టర్ లలో మాత్రమే రాజకీయ పార్టీ లు తమ వాయిస్ ను వినిపిస్తుండగా, ఇప్పుడు మొట్ట మొదటిసారి గా ఎం ఐ ఎం పార్టీ టిక్ టాక్ లో అఫీషియల్ ఖాతా తెరచి చరిత్ర సృష్టించింది.అయితే సోషల్‌మీడియాలో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాత్రమే పంచే టిక్‌టాక్ యాప్‌ను నూటికి 99 శాతం మంది సరదా వీడియోల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు.

కొంతమంది తమలో ఉన్న టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు.అలాంటి సంప్రదాయ పద్దతులను పక్కనబెట్టి ఎం ఐ ఎం పార్టీ తమ కార్యకర్తలకు దగ్గర కావాలని ఈ టిక్ టాక్ ను వేదికగా మార్చుకున్నారు.

Advertisement

ఈ టిక్‌టాక్ యాప్ ద్వారా మరింత మందికి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు రెడీ అవుతోంది.అయితే ఈ టిక్ టాక్ యాప్ పై ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి.

  ఈ యాప్ ద్వారా లైక్ లు సంపాదించాలని చాలా మంది తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్న పరిస్థితులు చాలానే ఉన్నాయి.అయితే అలాంటి ఈ యాప్ ని ఉపయోగించి ఎం ఐ ఎం పార్టీ తాము చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తుంది.మరి ఎంతమేరకు ఎం ఐ ఎం పార్టీ ఈ విషయంలో విజయం సాధిస్తుందో అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు