అమెరికాలో కలకలం: మెక్సికో బోర్డర్ గుండా దేశంలోకి అక్రమ వలసదారులు, ఐఎస్ఐఎస్‌తో లింక్.. ఎఫ్‌బీఐ వేట

అమెరికా( America )కు దొడ్డిదారిన వచ్చే అక్రమ వలసదారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.

 Migrants Entered Us With Help From Smuggler With Links To Isis, Fbi On The Hunt-TeluguStop.com

చివరికి మెక్సికో బోర్డర్‌లో పెద్ద గోడను నిర్మించినా ఏదో మూల నుంచి వలసదారులు అగ్రరాజ్యంలో అడుగుపెడుతూనే వున్నారు.ముఖ్యంగా మెక్సికో సరిహద్దుల్లో వలసదారుల సంక్షోభం నానాటికీ పెరుగుతోంది.

ఇదిలావుండగా.కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు వున్న స్మగ్లర్ల సాయంతో అమెరికాలోకి కొందరు అడుగుపెట్టినట్లుగా నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఎఫ్‌బీఐ వారి కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది.

సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.ఎఫ్‌బీఐ ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలోకి ప్రవేశించిన డజనుకు పైగా ఉజ్బెక్ జాతీయులను గుర్తించడానికి ప్రయత్నిస్తోంది.జో బైడెన్ కేబినెట్‌లోని ఉన్నతాధికారులకు వారి మార్నింగ్ బ్రీఫింగ్ బుక్‌లో అత్యవసరమైన క్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ నివేదికను పంపిణీ చేయడానికి ఇది కారణమైంది.ఈ నివేదిక ప్రకారం ఉజ్బెకిస్తాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో ఆశ్రయం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

వీరిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు విచారించారు.అయితే కోర్టు తేదీ పెండింగ్‌లో వుండటంతో వలసదారులను అమెరికాలోకి అనుమతించారు.

ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఐఎస్ఐఎస్‌కి లింక్ వున్నట్లుగా ఎఫ్‌బీఐ తేల్చింది.

Telugu Adrian Watson, America, Donald Trump, Fbi Hunt, Isis, Joe Biden, Mexico,

జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్( Adrian Watson ) ఈ విషయంపై సీఎన్ఎన్‌తో సంభాషిస్తూ కొన్ని కీలకాంశాలు పంచుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల నుంచి అమెరికాకు వలస వస్తున్నారని చెప్పారు.అయితే మధ్య ఆసియాలోని దేశాల నుంచి వచ్చినవారు అమెరికా భద్రతకు ఆందోళనకరంగా మారారని వాట్సన్ పేర్కొన్నారు.

నివేదిక ప్రకారం.వలసదారులలో 15 మందిని ట్రాక్ చేయగా.

కొందరు ఎఫ్‌బీఐ పరిశీలనలో వున్నారు.ప్రధానంగా 2024 అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నందున మెక్సికో సరిహద్దుల్లో వలసదారుల పరిస్ధితిపై అధ్యక్షుడు జో బైడెన్ విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Telugu Adrian Watson, America, Donald Trump, Fbi Hunt, Isis, Joe Biden, Mexico,

దేశ భద్రతకు పెను ప్రమాదం పొంచి వుండటంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.మెక్సికో గోడ( Mexico )ను నిర్మించడంతో పాటు సరిహద్దుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు.ఇప్పుడు ట్రంప్ అధికారంలో లేరు.దేశ సరిహద్దుల విషయంలో ఆయన వున్నంత దూకుడుగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్( Joe Biden ) లేరంటూ రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో యూఎస్- మెక్సికో సరిహద్దులోని టక్సన్ పోస్ట్‌పై ఇప్పుడు అందరి చూపు పడింది.అరిజోనాలో ఫ్లడ్ గేట్లను తెరవడంతో దేశంలోకి అక్రమ వలసలు పెరిగాయి.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.యూఎస్ అధికారులు నీటి ప్రవాహం పెంచడానికి, అంతరించిపోతున్న జింకల వలసలకు సాయం చేయడానికి సరిహద్దు వెంబడి 114 ఫ్లడ్ గేట్లను తెరిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube