విండోస్ 7, 8 ఇంకా వాడుతున్నారా? అయితే మీరు విండోస్ 11కి అప్‌గ్రేడ్ కాలేరు?

అవును, మీరు ఇంకా వాడుతున్నట్టైతే మీకు ఓ షాకింగ్ న్యూస్.సాఫ్ట్‌ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా విండోస్ 7, విండోస్ 8 యూజర్లకు( Windows 7/8 ) ఓ హెచ్చరిక జారీ చేసింది.

 Microsoft Finally Blocks Free Windows 11 Update Option For Windows 7 Users, Wind-TeluguStop.com

ఈ ఓఎస్ యూజర్లు ఉచితంగా విండోస్ 11కి అప్‌గ్రేడ్ చేసుకోకుండా కొత్త రిస్ట్రిక్షన్ ఒకదానిని తీసుకొచ్చింది.పాత విండోస్ వెర్షన్లను వాడుతున్న వినియోగదారులు మైక్రోసాఫ్ట్ నుంచి సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఫ్రీగా ఇన్‌స్టాల్ చేసుకోలేరన్నమాట.

ఇన్‌స్టాల్ చేయాలనుకున్నవారు కొత్త విండోస్ 11 కీ( Windows 11 Key )ని కొనుగోలు చేయక తప్పదు మరి.

Telugu Microsoft, Windows Key, Windows License, Windows-Technology Telugu

ఈ విషయాన్ని తాజాగా అమెరికన్ టెక్నాలజీ న్యూస్ వెబ్‌సైట్ ది వెర్జ్ ( The Verge ) తెలిపింది.మైక్రోసాఫ్ట్ ఈ మార్పును గత నెలలో ప్రకటించినా పూర్తిగా అమలు కాలేదు.దీని ఫలితంగా కొంతమంది వినియోగదారులు విండోస్ 7 లేదా 8 కీలతో విండోస్ 11ని ఇన్‌స్టాల్ చేసుకోగలిగారు.

కానీ, ఇకపై కొత్తగా ఈ ఓఎస్ యూజర్లు ఉచితంగా విండోస్ 11ని ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తే.వ్యాలీడ్ డిజిటల్ లైసెన్స్ లేదా ప్రొడక్ట్ కీ అవసరమని ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది.

అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి.

Telugu Microsoft, Windows Key, Windows License, Windows-Technology Telugu

విండోస్ 11కి అప్‌గ్రేడ్( Upgrade to Windows 11 ) చేయడానికి లేదా యాక్టివేషన్ చేయడానికి ఇప్పటికే విండోస్ 7 లేదా 8 కీని ఉపయోగిస్తే, చింతించాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఆ డిజిటల్ లైసెన్స్ ఇప్పటికీ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది మరి.దానితో ఎలాంటి సమస్యలు లేకుండా విండోస్ 11ని వాడుకోవచ్చు.భవిష్యత్తులో ఈ లొసుగును సద్వినియోగం చేసుకోవడం కుదరదు కాబట్టి, ఒరిజినల్ విండోస్ 11 కీని కొనుగోలు చేయడమే ఉత్తమం అని చేబోతోంది కంపెనీ.మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు లైసెన్స్ ఇచ్చే విధానాన్ని మారుస్తుందని అనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube