అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి మిలియనర్ మైఖేల్ బ్లూమ్‌బెర్గ్

బిలియనీర్, మాజీ న్యూయార్క్ నగర మేయర్ మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.ఇప్పటికే అలబామాలో డెమొక్రాటిక్ ప్రాథమిక ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అందుకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

77 ఏళ్ల బ్లూమ్‌బర్గ్ తన అభ్యర్థిత్వాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.అయితే ఆయన అధికారిక ప్రతినిధి జాసన్ షెచెటర్ మీడియాతో మాట్లాడుతూ.బ్లూమ్‌బర్గ్ పోటీకి సంబంధించి వచ్చే వారం మొదట్లో స్పష్టమైన ప్రకటన ఉంటుందని తెలిపారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధులు ట్రంప్‌కు సరైన సవాల్ విసరలేరని బ్లూమ్‌బర్గ్ భావిస్తున్నారు.డెమొక్రాటిక్ నామినీగా ఎంపిక కావాలని ఇప్పటికే 17 మంది ప్రయత్నాలు ప్రారంభించారు.

వీరిలో మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, సెనేటర్లు బెర్నీ సాండర్స్, ఎలిజబెత్ వారెన్ ముందు ఉన్నారు.ఒకవేళ ఆయన ఎన్నికల బరిలో దిగాతే.అయోవా, న్యూహాంప్‌షైర్ రాష్ట్రాల్లో బ్లూమ్‌బర్గ్‌కు సవాళ్లు ఎదురుకానున్నాయి.

ఎందుకంటే ఇక్కడ ఇతర డెమొక్రాట్లు నెలల నుంచి ప్రచారం చేస్తున్నారు.

Michael Bloomberg Actively Prepares To Enter Us Election 2020
Advertisement
Michael Bloomberg Actively Prepares To Enter Us Election 2020-అమెరి�

అయితే మార్చిలో సూపర్ మంగళవారం పోటీల ద్వారా బ్లూమ్‌బెర్గ్ బృందం వైట్ హౌస్‌కు మంచి మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.కాలిఫోర్నియా, అలబామా మరియు కొలరాడోతో సహా 14 రాష్ట్రాలు ఆ రోజున ఓటింగ్‌లో పాల్గననున్నాయి.కాగా బ్లూమ్‌బర్గ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే వార్తలతో అమెరికాలో పెద్ద చర్చ నడుస్తోంది.

ప్రపంచ సంపన్నుల్లో 14వ స్థానంలో వున్న ఆయన.ట్రంప్‌కు పోటీ చేస్తే గనుక ఎన్నికల తీరు తెన్నులే మారిపోయే అవకాశం ఉంది.బ్లూమ్‌బెర్గ్ విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేసి ప్రజాభిప్రాయాన్ని తనవైపు మళ్లించుకోగల సమర్థుడని పరిశీలకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు