పంట పొలాల( Crop fields )లో ఉండే కలుపు మొక్కలను తామర పురుగులు, తెల్ల దోమ,( white mosquito ) విండినల్లి, పెనుబంక లాంటివి అవాసాలుగా ఏర్పరచుకుంటాయి.ఒకవేళ పంట ఏమీ లేని సమయాలలో పొలం గట్లపై ఉండే తుత్తర బెండ, వయ్యారిభామ మొక్కలపై రసం పీల్చే మొక్కలు ఆవాసాలను ఏర్పరచుకొని వృద్ధి చెందుతాయి.
పొలంలో ఉండే కలుపు మొక్కలను రైతులు ఎప్పటికప్పుడు నివారిస్తూ పంటను సంరక్షించుకుంటారు.కానీ పొలం గట్లపై ఉండే కలుపు మొక్కలను రైతులు తొలగించకపోతే, ఆ మొక్కలు బాగా పెరిగి లక్షల్లో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి.
ఈ కలుపు మొక్క విత్తనాలు గాలి, నీరు ద్వారా పంట పొలం అంతా వ్యాపిస్తాయి.పంట విత్తనాలతో పాటు ఇవి కూడా తిరిగి మొలకెత్తుతాయి.వీటి నిద్రావస్థ కూడా దాదాపు 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది.https://telugustop.com/wp-content/uploads/2023/08/Eczema-mites-white-mosquito-Vindinalli-Penubandka.jpg
కాబట్టి ప్రతి సంవత్సరం రైతులు కలుపును నివారించడం కోసం కూలీల ఖర్చు అధికం అవుతోంది.ఇంకా ఈ కలుపు మొక్కల వల్ల చీడపీడల, తెగుళ్ల బెడద కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.కాబట్టి కలుపు మొక్కలను పూత రాకముందే నాశనం చేయాలి.
పూత వచ్చిన కలుపు మొక్కలను పీకినట్లయితే వాటి గింజలు నేలపై ర్యాలీ మళ్లీ తిరిగి మొలకెత్తుతాయి.

అలాకాకుండా రసాయన పిచికారి మందులను పంట పొలం గట్లపై పిచికారి చేయడం ( Spraying )వల్ల కలుపు ను నివారించవచ్చు.ఒక లీటరు నీటిలో 4- డి సోడియం సాల్ట్ రెండు గ్రాములు కలిపి కలుపు మొక్కలు పూతకు రాకముందే పిచికారి చేయాలి.లేదంటే 5గ్రా .అట్రాజిన్ 50శాతం ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.తొలకరి వర్షాలు పడిన తర్వాత గట్లపై కలుపు మొక్కలు మొలిచి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే పిచికారి చేసి నిర్మూలించాలి.
అప్పుడే పంటలలో కలుపు సమస్యలు పెద్దగా ఉండవు.