బ్రిటిష్ వారి అరాచక పాలన నుండి విముక్తి పొంది భారతదేశం 76 ఏళ్లు పూర్తిచేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.ఇన్నేళ్ల దేశ ప్రగతిలో ఎన్నో సమూలమైనటువంటి మార్పులు జరిగాయి.
ఎంతోమంది ప్రధానులు, ఎన్నో రాజకీయ పార్టీలు మనల్ని పాలించారు.ఎన్నో సంస్కరణలు వచ్చాయి, ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు.
మరి స్వదేశీయుల పాలనలో దేశ ప్రగతి ఏ విధంగా మారింది.ఇంకెలా మారబోతోంది.
అసలు మనం అభివృద్ధి చెందుతున్నామా.అభివృద్ధి చెందామా.
అనేది భూతద్దంలో పెట్టి చూడాల్సిన ప్రశ్న.మరి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశం ఆగస్టు 15, 1947లో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది.బ్రిటిష్ పాలకులు ( British rulers ) రెండు వందల సంవత్సరాల ఆధిపత్యం తర్వాత విముక్తి పొందిన మనం ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీన సంబరాలు చేసుకుంటాం.
ఇంతటి విముక్తి పొందడానికి సహకారం అందించినటువంటి స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటాం.అలాంటి ఈ స్వాతంత్ర భారతంలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ ( Jawaharlal nehru ) 1947, ఆగస్టు 15 నుండి 1964 మే 27 వరకు ప్రధానిగా పనిచేశారు.
ఈయన హయాంలోనే మొదటి పంచవర్ష ప్రణాళికలు రచించి అందులో పారిశ్రామిక రంగాలకు సంబంధించి పెట్టుబడులు పొందుపరిచారు.అంతేకాకుండా విద్యుత్,మైనింగ్ భారీ పరిశ్రమలు, పౌర సేవలతో ప్రైవేట్ రంగాన్ని అదుపులో ఉంచే మిశ్రమ ఆర్థిక విధానాన్ని తీసుకువచ్చారు.
కాలువలు తవ్వించడం, ఆనకట్టలు కట్టడం, వ్యవసాయ ఉత్పత్తి పెంచడం, పాల ఉత్పత్తిని పెంపొందించే విధంగా అనేక ప్రజాభివృద్ధి పథకాలు తీసుకువచ్చి ప్రజలను ప్రోత్సహించి ఒక దారిలోకి తీసుకువచ్చిన మొదటి ప్రధానమంత్రి.

అంతేకాకుండా విద్య,అభివృద్ధి కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పి విద్యకు పెద్దపీట వేశారు.ఈ విధంగా భారత దేశంలో ఎన్నో సమూలమైన మార్పులు తెచ్చిన మొదటి ప్రధానిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నెహ్రు.ఈయన తర్వాత గుల్జారి లాల్ నంద 1964 మే 27 నుంచి 1964 జూన్ 9 వరకు చేశారు.
ఈయన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ( Lal bahaddur shastri ) 1964 నుంచి 1966 వరకు కొనసాగారు.మరోసారి గుల్జారి లాల్ నంద 1966 నుంచి కొన్ని నెలల పాటు చేసిన తర్వాత , ఇందిరా గాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు చేసింది.

ఆ తర్వాత ఎంతోమంది ప్రధానులు మార్పు చెందుతూ 14వ ప్రధానిగా నరేంద్ర మోడీ 2014 మే 26 నుంచి కొనసాగుతూ వస్తున్నారు.ఇప్పటికీ 76 ఏళ్ల కాలంలో 13 మంది ప్రధానులు దేశానికి సేవలు అందించారు.14వ ప్రధానిగా నరేంద్ర మోడీ ( Narendra modi ) సేవలందిస్తున్నారు.ఇక నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో ఆర్టికల్ 370 రద్దు వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో విపరీతమైనటువంటి టెక్నాలజీ మాత్రం పెరిగిపోయింది.ఇతర దేశాలతో సత్సంబంధాలు పెరిగిపోయాయి.కానీ పేద ప్రజల బతుకులు పై మాత్రం విపరీతమైన భారం పడుతుందని చెప్పవచ్చు.ధనిక వర్గాలకు చెందినటువంటి వ్యాపారస్తులు ప్రపంచ దేశాలలో టాప్ 10 ధనిక లిస్ట్ లో ఒకటిగా చేరుతున్నారు.
కానీ కింది స్థాయి వర్గాల్లో ఉన్నటువంటి పేదవారు మాత్రం ఇంకా పేదవారిగానే మారుతున్నారని చాలా సర్వేలలో తేలుతోంది.దీనికి ప్రధాన కారణం నిరుద్యోగం.ప్రస్తుతం భారతదేశంలో నిరుద్యోగ రేటు 8.11 నమోదయింది.ఎంతోమంది చదువుకున్నటువంటి యువకులు, ఉద్యోగాలు లేక సతమతమవుతూ కూలీ పనులకు వెళ్తున్నారు.

ఈ విధంగా ఉంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది మనం గమనించుకోవాలి.అంతేకాకుండా విపరీతంగా పెరుగుతున్న రేట్లు పేద ప్రజలను నడ్డి విరుస్తున్నాయి.కనీసం పేదవారు పనిచేసి ఒక ఇల్లు కట్టుకుందామంటే జీవితకాలం కూడా సరిపోయే పరిస్థితి లేదు.
ఏ వస్తువు కొందామన్న రేట్లు ఆకాశాన్నంటాయి.ఇది పేద ప్రజలకు భారంగా మారిందని చెప్పవచ్చు.ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎంతో మంది నాయకులు మనల్ని పాలించారు.కానీ భారతదేశాన్ని అమెరికా (America), జపాన్ దేశాల్లా తయారు చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు.







