క్యారెట్ పంటను( Carrot Crop ) శీతాకాలపు పంట అని చెప్పవచ్చు.ఎందుకంటే క్యారెట్ పంటకు 18 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా అనుకూలంగా ఉంటుంది.
క్యారెట్ లో అధిక దిగుబడులు సాధించాలంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయాల్లో సాగు చేయాలి.క్యారెట్ పంట ఆగస్టు నుండి జనవరి 15 వరకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం.
క్యారెట్ పంట వేయడానికి ముందు నేలను రెండు లేదా మూడుసార్లు లోతు దుక్కులు దున్నుకోవాలి.ఆ తర్వాత ఆఖరి దుక్కిలో ఒక ఎకరం పొలానికి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు,( Cattle Manure ) 10 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాష్, 10 కిలోల నత్రజని ఎరువులు వేసి కలియదున్నాలి.
ఒక ఎకరం పొలానికి రెండు కిలోల విత్తనాలు అవసరం.మొక్కల మధ్య ఐదు సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.ఒక కిలో విత్తనాలకు మూడు కిలోల పొడి ఇసుక కలుపుకొని విత్తాలి.క్యారెట్ పంటను సాధారణ పద్ధతిలో కాకుండా ఎత్తు మట్టి బెడ్లను ఏర్పాటు చేసుకొని సాగు చేయడం వల్ల నాణ్యమైన క్యారెట్ దుంపల దిగుబడి పొందవచ్చు.
పైగా ఇలా సాగు చేస్తే దుంప కుళ్ళు పంటను ఆశించే అవకాశం తక్కువ.
క్యారెట్ పంటను బూడిద తెగుళ్ల( Grey Mildew ) ఆశిస్తే ఎలా గుర్తించాలంటే.క్యారెట్ ఆకులపై, ఆకుల కింద బూడిద రంగు ఏర్పడుతుంది.ఈ బూడిద రంగు ఏర్పడితే మొక్క ఎదుగుదల సక్రమంగా ఉండదు.
ఆలస్యం చేయకుండా వెంటనే ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకం కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.పంటకు తెగుళ్లు లేదా చీడపీడలు ఆశిస్తే సకాలంలో గుర్తించి తొలిదశలో అరికడితేనే మంచి నాణ్యమైన దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది.