న్యూజెర్సీలో( New Jersey ) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, న్యూజెర్సీలోని హోప్‌వెల్ టౌన్‌షిప్‌లోని( Hopewell Township ) ఒక ఇంటిపై ఉల్క ( Meteorite ) వచ్చి పడింది.
మెటాలిక్ వస్తువు అయిన ఈ ఉల్క పైకప్పు గుండా దూసుకుపోయి బెడ్ రూమ్‌లో దబేల్ మని పడింది.అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
ప్రస్తుతానికి పోలీస్ అధికారులు వస్తువు స్వభావాన్ని పరిశోధిస్తున్నారు.
అయితే ఇది హాలీస్ కామెట్( Halley’s Comet ) నుంచి వచ్చిన శిధిలాల వల్ల ఏర్పడిన ఎటా అక్వేరిడ్స్ ఉల్కాపాతానికి సంబంధించినదని భావిస్తున్నారు.దీని నుంచి శిధిలాలు కింద పడటం మే 27 వరకు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఇంటి యజమాని సుజీ కోప్ మాట్లాడుతూ, తాను బండను తాకినప్పుడు అది వెచ్చగా ఉందని చెప్పారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు.ఆ వస్తువు దాదాపు నాలుగు అంగుళాలు, ఆరు అంగుళాల పరిమాణంలో ఉందని, ఇది పైకప్పులోకి చొచ్చుకుపోయి, గట్టి చెక్క నేలపై పడిపోయిందని పోలీసులు పేర్కొన్నారు.
అంతరిక్ష శిలలు రోజూ భూమి ఉపరితలంపై పడినప్పటికీ, అవి జనావాస ప్రాంతాలను తాకడం చాలా అరుదు, ఎందుకంటే గ్రహం చాలా వరకు అభివృద్ధి చెందని ప్రాంతాలు లేదా మహాసముద్రాలతో కప్పబడి ఉంటుంది.మరోవైపు, ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ పరిమాణంలో ఉన్న గ్రహశకలం 2046లో భూమిని తాకవచ్చని NASA అంచనా వేసింది.అయితే దీనికి హోప్‌వెల్ టౌన్‌షిప్‌లో ఇటీవల జరిగిన సంఘటనతో సంబంధం లేదు.