మెహర్ రమేష్( Meher Ramesh ) పేరు వింటే టాలీవుడ్ హీరోలు కానీ, నిర్మాతలు కానీ భయపడే పరిస్థితి నెలకొంది.హీరోలను స్టైలిష్ గా చూపిస్తాడని పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు తన సినిమాలతో బాక్సాఫీస్ కు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చారు.
భోళా శంకర్ సినిమాలో చిరంజీవి పవన్ ను ఇమిటేట్ చేసే సన్నివేశాలు సైతం ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి.తెలుగులో ఈ దర్శకుడు తీసిన ఒకే ఒక హిట్ సినిమా ఏదనే ప్రశ్నకు బిల్లా సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది.
ప్రభాస్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలోని ప్రభాస్ లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.అయితే బిల్లా ( Billa )కాకుండా మెహర్ రమేష్ ఖాతాలో మరికొన్ని హిట్లు ఉన్నాయి.ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలను మెహర్ రమేష్ కన్నడలో వీర కన్నడిగ, అజయ్( Ajay ) పేర్లతో రీమేక్ చేయగా ఈ రెండు సినిమాలు అక్కడ సక్సెస్ సాధించడం గమనార్హం.
ఈ సినిమాలు అంచనాలను అందుకోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ కు తన సినిమాకు పని చేసే అవకాశం ఇవ్వడం జరిగింది.అయితే కంత్రి సినిమాతో మెహర్ రమేష్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.మెహర్ రమేష్ కు తెలుగులో కొత్త ఆఫర్లు కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మెహర్ రమేష్ ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం దక్కడం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.మెహర్ రమేష్ తన ఫ్లాప్ సినిమాలకు సంబంధించి మాట్లాడుతూ ఆ సినిమాల రిజల్ట్ విషయంలో తన తప్పేం లేదనే విధంగా మాట్లాడుతున్నారు.
మెహర్ రమేష్ మరో రంగంపై దృష్టి పెడితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మెహర్ రమేష్ గురించి సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్స్ వస్తుండటం గమనార్హం.