మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజును మార్చి 27వ తేదీ ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు అందరిని ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఈ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని సందడి చేశారు.ఇకపోతే చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా చిరంజీవి ఆర్ఆర్ఆర్ (RRR) టీమ్ ను ఘనంగా సత్కరించారు.
రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఆస్కార్ అవార్డును(Oscar Award) అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా గొప్ప పురస్కారాన్ని అందుకోవడంతో తెలుగు సినిమా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది.ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించి ఆర్ఆర్ఆర్ టీమ్ కి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి దంపతులు కీరవాణి దంపతులతో పాటు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ,కార్తికేయ, ప్రేమ్ రక్షిత్, నిర్మాత దానయ్యకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించడమే కాకుండా ఘనంగా పార్టీ ఇచ్చారు.

ఇక ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.నాగార్జున దంపతులతో పాటు వెంకటేష్ శ్రీకాంత్ విజయ్ దేవరకొండ, నాగచైతన్య, అడవి శేషు, మనోజ్ దంపతులు, మంచు లక్ష్మి వంటి తదితర హీరోలు, దర్శక నిర్మాతలు ఈ వేడుకలలో పాల్గొని మెగా ఆతిథ్యం స్వీకరించారు.ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆస్కార్ విజేతలను మిత్రుల సమక్షంలో సత్కరించుకోవడం నిజమైన వేడుక అనిపించింది.తెలుగువారు భారతీయ సినిమాకి సాధించిన ఈ పురస్కారం చరిత్రగా నిలిచిపోతుంది అంటూ చిరంజీవి ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.







