షాకింగ్ న్యూస్...జనసేనలోకి చిరంజీవి

రాజకీయం ఎప్పుడు ఎలాంటి రంగు పూసుకుంటుందో ఎవరికీ తెలియదు…ఒక్కో సారి వీళ్ళు వద్దు అనుకుంటుంది మళ్ళీ వాళ్ళనే దగ్గర తీసుకుంటుంది.అవును దీన్నీ రాజకీయం అనే అనాలి.

 Megastar Chiru Will Join Into Janasena Party-TeluguStop.com

ఇప్పుడు ఏపీలో జరిగేది కూడా అదే.పవన్ పార్టీ పెట్టి ఐదేళ్ళు కావస్తున్నా సరే ఇప్పటికీ పార్టీని ముందుకు తీసుకు వెళ్ళలేదు.అయితే ఇప్పుడు పవన్ కి ఏపీ ప్రజలు వారి భాదల మీద ప్రేమ అమాంతం కలిగింది.అందుకే ఇప్పుడు అనుకోని విధంగా మీటింగ్స్.సందర్శనలు చేసుకుంటూ.వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ హల్చల్ చేస్తున్నాడు

అయితే.

పవన్ గత రెండు రోజుల నుంచీ చేస్తున్న కామెంట్స్ లో వారసత్వం గురించి మాత్రమే అందరు మాట్లాడారు.కానీ తానూ మాట్లాడిన మరొక అంశం గురించి మాత్రం ఎవ్వరు ఫోకస్ చేయడం లేదు.

తన అన్న గురించి మాట్లాడుతూ అన్నయ్య సీఎం కాకపోవడం వెనుక కొంత మంది కుట్ర ఉందని.రాజకీయాల్లో అన్నయ్య ఎదగలేక పోవడం వెనుక ఎవరు ఎవరు ఉన్నారో తనకి తెలుసని వారికి తప్పకుండ బుద్ది చెప్తా అని అన్నాడు పవన్ కళ్యాణ్

అయితే ప్రస్తుతం రాజకీయాల్లో జనసేన గురించి ఓ సంచలన వార్తా చక్కర్లు కొడుతోంది

పవన్ అన్నయ్య చిరంజీవి జనసేనలోకి వస్తున్నాడు అంటూ ఈ వార్తా కాస్తా వైరల్ అవుతోంది.

ఈ చర్చ తెలుగు రాష్ర్టాల్లో జరుగుతోంది.ఈ సందర్భంగా ఆయన అభిమాన – వ్యతిరేక వర్గాలు ఎవరికి వారు ఆయన తీరుపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ పెట్టిన తరువాత ఇంతవరకు ఎన్నడూ లేనట్లుగా ఆయన తన అన్న చిరంజీవిని ఫోకస్ చేస్తుండడం చర్చనీయమవుతోంది.అంతేనా ఒకడుగు ముందుకు వేసి అన్నయ్యని దెబ్బ తీయడానికి ఎవరెవరు ఫోకస్ చేశారో నేను ఇప్పుడు వారి మీద ఫోకస్ చేస్తున్నా అంటూ పవన్ చెప్పడం చర్చకు దారి తీస్తోంది.

ఓకే వేళ కాలం కలిసొచ్చి తన పార్టీ అధికార చేపడితే తన అన్నకు సీఎం కుర్చీ ఇవ్వాలని.ఒక వార్తా హల్చల్ చేస్తుంటే.

జనసేన గౌరవ అధ్యక్షుడిగా చిరుని కూర్చో పెడుతాడు అని మరొక వార్తా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి

కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం చిరూకి ఉందన్న కారణంగానే ఈ నిర్ణయం పవన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.దీన్ని బట్టి చూస్తే తొందర్లోనే చిరూ కూడా జనసేనలో చేరి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై స్ప్రష్టమైన క్లారిటీ ఎవ్వరూ ఇవ్వకపోవడంతో అభిమానులు ఉత్కంటతో ఉన్నారు.ఇక్కడే మరొక విషయం ఏమిటి అంటే చిరు ని అణగ దోక్కడానికి ఎవరెవరు ఫోకస్ చేశారో వారిని నేను వదలను అన్న పవన్ మరి చిరు ప్రజారాజ్యం టిక్కెట్లు అమ్ముకున్నాడు అంటూ అప్పట్లో చంద్రబాబు మీడియా అండ్ కో మీడియాలో నాన్ స్టాప్ గా వచ్చిన వార్తలు గుర్తులేవా? మరి చిరు పరువు పోవడానికి చంద్రబాబు ఒక కారణం కాదా అంటూ మరి కొతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube