ఇటీవల గాంధీ ఆసుపత్రి వైద్యులు అడవి దొంగసినిమా చూపిస్తూ ఓ మహిళకు ఆపరేషన్ చేయడం జరిగింది.రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన ఈ ఆపరేషన్ అత్యంత కష్టమైనది.
మెదడులోని కన్నతలను తొలగించడానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూపించి ఆపరేషన్ విజయవంతం చేశారు.ఈ విషయం ఇటీవల చిరంజీవి తెలుసుకొని తన సిబ్బందిని ఆసుపత్రికి పంపించారు.
ఈ సందర్భంగా మహిళకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులను కలవడం జరిగింది.అనంతరం ఆపరేషన్ చేయించుకున్న మహిళనీ కలిశారు.ఈ క్రమంలో ఆ మహిళా తాను చిరంజీవి అభిమానిని.ఆయన సినిమాలను ప్రతిదీ క్రమం తప్పకుండా చూస్తానని చెప్పడం జరిగింది.
అనంతరం చిరంజీవి సిబ్బంది అక్కడి నుంచే చిరంజీవికి ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు.ఈ క్రమంలో వీలు చూసుకుని రాబోయే రోజుల్లో ఆసుపత్రికి వస్తానని చెప్పడం జరిగింది.