తెలుగు సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానం ఉంది.
నాని హీరోగా అడుగు పెట్టకముందు క్లాప్ అసిస్టెంట్ గా పని చేశాడు.నిజానికి ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవ్వాలని అనుకున్నాడు.
కానీ నటుడిగా అడుగు పెట్టాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం ఒక అదృష్టం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు నాని.
ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి అష్టా చమ్మా సినిమాతో పరిచయమయ్యాడు.ఈ సినిమాలో హీరోగా నటించిన నాని తన తొలి నటనకే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకున్నాడు నాని.
ఇక తను ఎంచుకునే కథల విషయం లో కూడా మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.ఇక గతంలో మంచి మంచి హిట్ లను అందుకున్న సినిమాలలో అవకాశాలు వచ్చినా కూడా వదిలేసాడు.
ఇక ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టగా అందులో నాని కూడా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అడుగు పెట్టాడు.ఇక ఇదంతా పక్కన పెడితే చాలా వరకు నాని ఒక ఫాంటసీ ఫాలో అవుతాడు.
ఇంతకీ ఆ ఫాంటసీ ఏంటంటే డ్యూయల్ రోల్ లో నటించడం.ఇప్పటివరకు నాని పలు సినిమాలలో డ్యూయల్ పాత్రలో నటించి మంచి సక్సెస్ అందుకోగా.ఇంతకు ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
శ్యామ్ సింగరాయ్: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా శ్యామ్ సింగరాయ్.ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించారు.ఈ సినిమా 2021 లో ప్రేక్షకుల ముందుకు రాగా ఇందులో కూడా నాని రెండు పాత్రలలో నటించాడు.ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.

కృష్ణార్జున యుద్ధం: 2018 లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో విడుదలైన సినిమా కృష్ణార్జున యుద్ధం.ఇందులో నాని సరసన అనుపమ పరమేశ్వరన్,రుక్సార్ ధిల్లన్ నటించారు.ఇందులో కూడా నాని ద్విపాత్రాభినయం చేశాడు.
ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
జెంటిల్ మెన్: 2016లో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా జెంటిల్ మెన్.ఈ సినిమాలో నాని, నివేదా థామస్, సురభి నటీనటులుగా నటించారు.ఈ సినిమాలో నాని రెండు పాత్రలలో నటించాడు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
జెండాపై కపిల్ రాజు: 2014 లో సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన అమలా పాల్, రాగిణి ద్వివేది నటించగా ఇందులో కూడా నానీ రెండు పాత్రలలో నటించాడు.ఇక ఈ సినిమా కూడా బాగా హిట్ అయ్యింది.







