మెగాస్టార్ చిరంజీవి గారు అవకాశం ఇస్తే తెలుగులో నటిస్తా..అమీర్ ఖాన్

మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతకంపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీనటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లాల్ సింగ్ చెడ్డా“.ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజుగా కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు .ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగచైతన్యలు పాల్గొన్నారు.

 Megastar Chiranjeevi Will Act In Telugu If Given A Chance Aamir Khan , Megasta-TeluguStop.com

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మాట్లాడుతూ…

‘ఇదివరకు తెలుగు డబ్బింగ్ సినిమాలకు తక్కువ మార్కెట్ ఉండేది.అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.అందుకే తెలుగులో మా సినిమాను రిలీజ్ చెయ్యడానికి చిరంజీవిని అప్రోచ్ అవ్వడం జరిగింది.

సల్మాన్ ఖాన్ చిత్రంలో చిరంజీవి నటిస్తున్నాడు.చిరంజీవి నాకు కూడా అవకాశం ఇస్తే నేను తనతో నటించడానికి సిద్ధంగా ఉన్నానని’ తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.

‘అమీర్ ఖాన్ ఈ సినిమా ప్రీమియర్ చూడమంటే సుకుమార్, రాజమౌళి, కింగ్ నాగార్జునతో చూశాను.చూసిన తరువాత తేరుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది.అమీర్ ఖాన్ పెర్ఫార్మన్స్ ఎక్సట్రార్ధినరీ గా ఉంది.అమీర్ ఖాన్ పాత్రతో పాటు .చైతన్య పాత్ర కు బాగా ఎమోషనల్ అయ్యాను.ఇలాంటి సినిమాలు ఎక్స్పరమెంటల్ తో పూర్తి డెడికేటెడ్ సినిమాలు తియ్యాలి అంటే అమీర్ ఖాన్ వల్లే అవ్వాలి.నేనైతే ఇలాంటి సినిమాలు తియ్యలేను.సినిమా బాగుందని అమీర్ ఖాన్ కు చెప్పడంతో హ్యాపీ ఫిల్ అయ్యాడు.తను తెలుగులో విడుదల చేయడానికి హెల్ప్ అడగడంతో సినిమా కూడా బాగుండడంతో తెలుగులో ఈ సినిమాను సమర్పిస్తున్నాను.

తెలుగులో కూడా ప్రేక్షకుల మన్ననులు అందుకుంటుందని’ అన్నారు.

Telugu Aamir Khan, Advait Chandan, Ajith Andhare, Kareena Kapoor, Kiran Rao, Chi

అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.

.‘ఈ సినిమా నా కేరెర్ కు హెల్ప్ అవుతుందనే లెక్కలతో ఈ సినిమా చెయ్యలేదు.అమీర్ ఖాన్ లాంటి వారితో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను.ఇందులో నా పాత్ర నిడివి 30 నిముషాలు ఉంటుంది.ఈ సినిమా విడుదల అయిన తరువాత నా పాత్రను బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని’ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube