జనసేన కు ' మెగా ' సపోర్ట్ .. ప్రచారానికి వారు వస్తారా ?

మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఏపీ ఎన్నికలు జనసేన పార్టీకి( Janasena Party ) అత్యంత ప్రతిష్టాత్మకంగానే మారాయి.

టిడిపి, బిజెపిలతో పొత్తు పెట్టుకున్న జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో గెలవడం ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.

ముఖ్యంగా పవన్ ( Pawan Kalyan ) పోటీ చేస్తున్న పిఠాపురంలో గెలుపు కోసం ఆయన గట్టిగానే కష్టపడుతున్నారు.ఈ వ్యవహారం ఇలా ఉండగానే పవన్ కు జనసేనకు మెగాస్టార్ అండదండలు దక్కాయి.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఆశీర్వదించారు.ఐదు కోట్ల రూపాయల ను జనసేనకు విరాళంగా చిరంజీవి అందించారు.

అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం నాకు సంతోషాన్ని కలిగించింది.

Megastar Chiranjeevi Support For Janasena Will They Come For The Campaign Detail
Advertisement
Megastar Chiranjeevi Support For Janasena Will They Come For The Campaign Detail

తన స్వార్జీతం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకు విరాళాన్ని అందించాను అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.అయితే వచ్చే ఎన్నికల్లో జనసేనకు అండగా నిలవబోతున్నట్లు చిరంజీవి ఎక్కడా ప్రకటించలేదు.కేవలం తన సోదరుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న సాయాన్ని హైలెట్ చేసి, దానికోసమే తాను విరాళం ఇచ్చినట్లుగా చిరంజీవి సంకేతాలు ఇచ్చారు.

అయితే చిరంజీవి అధికారికంగా జనసేనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తే .రాజకీయంగా ఆయనకు ఇబ్బందులు వస్తాయని, ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా చిరంజీవి ఉన్నారు.దీంతో రాజకీయ వ్యవహారాల్లో ఆయన ఎక్కడా జోక్యం చేసుకోవడం లేదు.

Megastar Chiranjeevi Support For Janasena Will They Come For The Campaign Detail

కానీ పరోక్షంగా మాత్రం పవన్ కు మద్దతు ఇస్తున్నట్లుగా సంకేతాలు పంపించేందుకే చిరంజీవి ఈ విరాళాలని అందించినట్లుగా అర్థం అవుతుంది.ఇక రాబోయే రోజుల్లో మెగా హీరోలు( Mega Heroes ) పవన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారనే హడావుడి జరుగుతుంది.గత ఎన్నికల్లో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు భీమవరం, గాజువాకలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వారితో పాటు అల్లు అర్జున్,( Allu Arjun ) రామ్ చరణ్( Ram Charan ) వంటి వారు ఎన్నికల ప్రచారానికి వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు