మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత ఒకేసారి 3 సినిమాల అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ ను అలరించాడు.లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్, కె.
ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా ఎనౌన్స్ చేశారు.గాడ్ ఫాదర్ సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది.
అయితే ఈ మూడు సినిమాల్లో కె.ఎస్ రవీంద్ర సినిమా మాత్రమే ఒరిజినల్ కంటెంట్ తో వస్తుంది.మిగతా రెండు సినిమాలు మాత్రం రీమేక్ లుగా వస్తున్నాయి.మెగాస్టార్ చిరంజీవి సినిమా చేసేందుకు కథలు దొరకట్లేదా లేక కావాలనే చిరు రీమేక్ లపై ఆసక్తి చూపిస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.
లూసిఫర్ రీమేక్ అయితే పర్వాలేదు అనుకోవచ్చు కాని కోలీవుడ్ లో హిట్టైన వేదాళం సినిమా తెలుగు రీమేక్ అనగానే ఆడియెన్స్ షాక్ అయ్యారు.చిరు ఆ సినిమా రీమేక్ చేస్తాడని ఎవరు ఊహించలేదు.
అయితే మెహర్ రమేష్ మాత్రం ఆ కథను తీసుకుని తెలుగులో భారీ మార్పులు చేసినట్టు చెప్పుకుంటున్నారు.అందుకే చిరు ఆ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని అంటున్నారు.
భోళా శంకర్ సినిమాలో చిరు సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.