చిరంజీవికి విపరీతంగా నచ్చేసిన బ్లఫ్ మాస్టర్ సినిమా

సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ దర్శకత్వంలో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా రెండేళ్ళ క్రితం వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ సినిమా కంటెంట్ పరంగా ఒకే అనిపించుకొని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

అయితే సినిమా థియేటర్ లో ఆశించిన స్థాయిలో ఆడలేదు.టెలివిజన్ లో మాత్రం ఈ సినిమాకి మంచి రేటింగ్స్ వచ్చాయి.

ఈ సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమాపై ప్రశంసలు కురిపించారు.

చిరంజీవికి ఒక సినిమా నచ్చింది అంటే కచ్చితంగా అందులో ఏదో ఒక విశేషం ఉండాలి.ఏ సినిమా గురించి మెగాస్టార్ అంతగా పొగడ్తలు కురిపించరు.

Advertisement

అయితే తాజాగా బ్లఫ్ మాస్టర్ సినిమా చూసిన చిరంజీవి దర్శకుడుని ఇంటికి పిలిపించుకొని సినిమాపై ప్రశంసలు కురిపించారు.తన కుటుంబసభ్యులతో కలిసి సినిమాను వీక్షించిన చిరుకి సినిమా చాలా భాగా నచ్చిందని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి పిలుపుతో దర్శకుడు గోపీ గణేష్ ఆయన ఇంటికి వెళ్లి గంటపాటు ఈ సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తుంది.తనకిష్టమైన సీన్లు, డైరెక్షన్‌ పనితీరుపై ప్రశంసలు కురిపించినట్టు ఫిలింనగర్‌ వర్గాల టాక్‌.

చిరంజీవితో గోపీ గణేశ్‌ దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఇక అదే సమయంలో మంచి కథ ఉంటే సిద్ధం చేసుకోమని కూడా సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది.

అతను కథ సిద్ధం చేస్తే మెగా కాంపౌండ్ హీరోతో సినిమా చేసే అవకాశం గోపీ గణేష్ కి ఇవ్వాలని చిరంజీవి యోచిస్తున్నట్లు బోగట్టా.మరి చిరంజీవి ఆఫర్ ని గోపీ గణేష్ ఎంత వరకు ఉపయోగించుకుంటారు అనేది వేచి చూడాలి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
క్రమం తప్పకుండా లిప్స్ స్టిక్ ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

చిరంజీవికి విపరీతంగా నచ్చేసిన బ్లఫ్ మాస్టర్ సినిమా.

Advertisement

తాజా వార్తలు