గోపీచంద్ కోసం మెగాస్టార్ వస్తున్నాడు..!

మాచో హీరో గోపీచంద్ హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న రిలీజ్ ఫిక్స్ చేశారు.

గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు.జాలీ ఎల్.ఎల్.బి 2 రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ గా కనిపిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 26న శిల్పకళా వేదికలో జరుగనుంది.

Megastar Chiranjeevi Guest For Gopichand Pakka Commercial Pre Release Event Gop

పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా అంటే చిరు సొంత సినిమా అన్నట్టే లెక్క.

ఆ బ్యానర్ లో నటించే సినిమాకు మెగా ప్రోత్సాహం ఉంటుంది.ఈ క్రమంలో పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్స్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా తన సపోర్ట్ అందించనున్నారు.

Advertisement

ఇప్పటికే టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచగా సినిమా మారుతి మార్క్ పక్కా ఎంటర్టైనర్ మూవీగా వస్తుందని తెలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు