మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గత 45 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలతో సంచలనాలను సృష్టిస్తూ అభిమానులకు దగ్గరవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటించడం విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి రీమేక్ లలో ఎందుకు నటిస్తున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

ఈ కామెంట్లు తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో చిరంజీవి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.సినిమా ఇండస్ట్రీ పుష్పక విమానం లాంటిదని ఎంతమంది వచ్చినా మరి కొంతమందికి స్థానం ఉంటుందని ఈ ఇండస్ట్రీ( Film Industry ) అక్షయ పాత్ర లాంటిదని ఎంతమంది తిన్నా ఆకలి తీరుస్తుందని అందువల్ల సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరూ వెనుకడుగు వేయవద్దని చిరంజీవి చెప్పుకొచ్చారు.
అమ్మ ప్రేమ అభిమానుల ప్రేమ ఎప్పుడూ బోర్ కొట్టదని అది చల్లగా మదిని హత్తుకుంటుందని ఫ్యాన్స్ గర్వపడేలా ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటానని ఆయన అన్నారు.
ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నానని చిరంజీవి వెల్లడించారు.ఎందుకు రీమేక్ సినిమాలలో( Remake Movies ) నటిస్తున్నారని కొంతమంది తరచూ అడుగుతున్నారని మంచి కథ దొరికితే రీమేక్ చేయడంలో తప్పేంటని చిరంజీవి ప్రశ్నించారు.

భోళా శంకర్ మాతృక వేదాలం( Vedalam ) ఏ ఓటీటీ వేదికలోనూ అందుబాటులో లేదని చిరంజీవి తెలిపారు.ఈ సినిమా సూపర్ హిట్ అని మనసులో నాటుకుపోయిందని చిరంజీవి తెలిపారు.సినిమా ఇండస్ట్రీలోకి బిక్కుబిక్కుమంటూ ప్రవేశించానని కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న రోల్స్ లో నటిస్తుంటే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనని భయపడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.చిరంజీవి చెప్పిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
భోళా శంకర్( Bhola Shankar ) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తమన్నా హ్యాండ్ ఇవ్వడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.