డబ్బు గురించి మాట్లాడుతూ పొదుపు పాఠాలు చెబుతున్న మెగా ప్రిన్స్!

మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు.విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

 Mega Prince Telling About Money And Saving Tips Varun Tej, Tollywood, Money Tips, F3 Movie , Venkatesh, Anil Ravipudi, Pramotions, Tamanna , Mahreen-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ దక్కించుకుంది.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వరుణ్ తేజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 Mega Prince Telling About Money And Saving Tips Varun Tej, Tollywood, Money Tips, F3 Movie , Venkatesh, Anil Ravipudi, Pramotions, Tamanna , Mahreen-డబ్బు గురించి మాట్లాడుతూ పొదుపు పాఠాలు చెబుతున్న మెగా ప్రిన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా డబ్బు చుట్టూ సాగే కథ కావడంతో డబ్బు గురించి వరుణ్ తేజ్ కు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ డబ్బు విలువను తెలుపుతూ డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలనే విషయాల గురించి వెల్లడించారు. డబ్బు విషయంలో తాను ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ వెల్లడించారు.

డబ్బులను మనం ఎంత సులువైన మార్గంలో సంపాదిస్తామో అంతే సులువైన మార్గంలో వెళ్లిపోతాయని ఈయన తెలియజేశారు.

మన దగ్గర డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, వరుణ్ తేజ్ డబ్బు విలువ గురించి తెలియజేశారు.తాను పదవ తరగతి చదువుతున్న సమయంలోనే కేవలం 50 రూపాయల పాకెట్ మనీతో బస్సుచార్జీల తోపాటు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి అలాగే సినిమాలు చూడటానికి కూడా అదే డబ్బులు ఉపయోగించుకునేవాడిననీ, డబ్బు విషయంలో తాను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ డబ్బు పొదుపు చేయడం గురించి తెలియజేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube