తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి స్పెషల్ గుర్తింపు ఉంది.అసలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కెరీర్ స్టార్ చేసి అందరి చేత మన్ననలు పొంది మెగాస్టార్ గా మారిపోయాడు చిరంజీవి.
ఈయన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు.చిరు తర్వాత అదే స్థాయిలో మెప్పించిన హీరో పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.
ఈయన చిరు తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు.మెగాస్టార్ వారసుడుగా రామ్ చరణ్ తేజ్ కూడా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి వరుస విజయాలు అందుకుంటూ సినిమా సినిమాకు నటన పరంగా కూడా బెస్ట్ ఇస్తున్నాడు.
ఇటీవలే ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
పవన్ కళ్యాణ్ కూడా భీమ్లా నాయక్ తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తుండగా.వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేసున్నట్టు టాక్.

మరో వైపు రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న విషయం విదితమే.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది.అయితే ఈ సినిమా కూడా రాబోయే సంక్రాంతికే రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.దీంతో బాబాయ్ కళ్యాణ్ బాబుకి, అబ్బాయి చరణ్ ఈ సినిమాతో పోటీ ఇవ్వబోతున్నాడని రూమర్స్ వచ్చాయి.

కానీ ఇందులో నిజం లేదట.చరణ్, శంకర్ ఆర్సీ 15 సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారట.ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.అయితే దిల్ రాజు నిర్మిస్తున్న మరో భారీ బడ్జెట్ సినిమా వారసుడు సంక్రాంతికి రిలీజ్ కానుంది.
దిల్ రాజు ఒకేసారి తన రెండు భారీ ప్రాజెక్ట్స్ ను రిలీజ్ చేయడు కాబట్టి ఈ వార్తలు అబద్ధం అని అవన్నీ రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.