పీరియడ్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మెగాడాటర్.. సిగ్గు పడొద్దంటూ?

మెగాడాటర్ సుస్మిత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సుస్మిత కొణిదెల ప్రొడక్షన్స్ వ్యవహారాలను చూసుకోవడంతో పాటు తండ్రి చిరంజీవి, సోదరుడు రామ్ చరణ్ కు తన వంతు సహాయసహకారాలను అందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

 Mega  Daughter Susmita Comments About Periods Goes Viral In Social Media , Mega-TeluguStop.com

సుస్మిత వివాదాలకు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటారని ఇండస్ట్రీలో పేరుంది.సుస్మితకు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా సుస్మిత అమ్మాయిల పీరియడ్స్ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చాలామంది అమ్మాయిలు ఈ అంశం గురించి మాట్లాడటానికి ఇష్టపడరు.

పీరియడ్స్ గురించి మహిళలు, పురుషులలో కొన్ని అపోహలు ఉన్నాయి.చాలామందిలో నెలకొన్న అపోహలను తొలగించడానికి సుస్మిత తన వంతు ప్రయత్నాలు చేయడం గమనార్హం.

పీరియడ్స్ కు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

పీరియడ్స్ గురించి మాట్లాడటానికి ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఉండటంపై నేను బాధ పడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

పీరియడ్స్ మహిళల శరీర అభివృద్ధికి తోడ్పడతాయని ఆమె కామెంట్లు చేశారు.పీరియడ్స్ గురించి మాట్లాడుకోవడంలో సిగ్గు పడాల్సింది ఏమీ లేదని ఆమె తెలిపారు.పీరియడ్స్ గురించి అవగాహన లేకపోవడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Telugu Periods, Konidela, Ram Charan, Susmita-Movie

రాబోయే రోజుల్లో సమాజ అభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర అని ఆమె తెలిపారు.పీరియడ్స్ విషయంలో నెలకొన్న అపోహలను మహిళలు ఇప్పటికైనా తొలగించుకోవాలని ఆమె తెలిపారు.సుస్మిత ఈ విధంగా ముందుకు రావడం గురించి పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

మెగా డాటర్ మెగా డాటరే అని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.సుస్మిత వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి కీర్తిప్రతిష్టలను మరింత పెంచేలా సుస్మిత వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube