ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ... మెగా బ్రదర్ కూ ఛాన్స్

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) శ్రీకారం చుట్టారు .

ఏపీలో టిడిపి,  జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల విషయమై చాలామంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 23,000 మంది నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఈ పదవుల భర్తీ విషయంలో ఇప్పటికే జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ),  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు , రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరితో( MP Daggupati Purandareshwari ) చంద్రబాబు చర్చించారు.

ఈ సందర్భంగా దశలవారీగా ఈ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు.మూడు పార్టీలలోని నాయకులకు ఏ విధంగా పదవులు కేటాయించాలనే విషయం పైన ఒక క్లారిటీకి వచ్చారు.

అలాగే టిడిపి సీనియర్లకు కీలక పదవులు ముందుగా ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Mega Brother Has A Chance To Fill Nominated Posts In Ap, Tdp Ap Government, Ap C
Advertisement
Mega Brother Has A Chance To Fill Nominated Posts In AP, TDP Ap Government, AP C

టిడిపి సీనియర్లతో పాటు, జనసేన , బిజెపిలోని( Janasena, BJP ) ముఖ్యమైన నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు .మెగా బ్రదర్ నాగబాబుకూ( Mega Brother Nagababu ) కీలకమైన పదవిని కేటాయించబోతున్నట్లు సమాచారం.  అలాగే బిజెపిలో ఎంపీ,  ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారట.

టిడిపి సీనియర్ నేత,  మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఆర్టీసీ చైర్మన్ , ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్ , పట్టాభికి పౌరసరఫరాల కార్పొరేషన్,  మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్,  మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టి కమిషన్ చైర్మన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది .జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీటు కేటాయించడంతో  అక్కడ సీటు కోల్పోయిన టిడిపి సీనియర్ నేత,  మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అమరావతికి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం .

Mega Brother Has A Chance To Fill Nominated Posts In Ap, Tdp Ap Government, Ap C

రాష్ట్రవ్యాప్తంగా 90 వరకు కార్పొరేషన్లు ఉండగా , వాటి చైర్మన్ లు , అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి.  ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు.దాదాపు 30% పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం.

అలాగే టిటిడి బోర్డు ఏర్పాటు పైన ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.  ఓ మీడియా సంస్థ అధినేతకు టీటీడీ చైర్మన్ పదవిని కేటాయించబోతున్నట్లు సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు