హీరో విశాల్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మీరా మిథున్

కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సౌత్ కంగనా క్రింద మీరా మిథున్ మారిపోయింది.వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.

 Meera Mithun Comments On Hero Vishal, Kollywood, Meera Mithun, Hero Vishal, Sout-TeluguStop.com

స్టార్ హీరోలని అదే పనిగా టార్గెట్ చేస్తూ మీడియాలో కావాల్సినంత హైప్ ని సొంతం చేసుకుంటుంది.కావాలని వివాదాలు సృష్టిస్తూ తన ఇమేజ్ పెంచుకుంటుంది.

ఆమె చేసిన సినిమాలు ఏంటి అనేది ఎవరికీ తెలియకపోయినా ఇప్పుడు కోలీవుడ్ లో మీరా మిథున్ హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.ఇండస్ట్రీలో చాలా మంది ఆమె గురించి చర్చించుకుంటున్నారు.

ఆ మధ్య కోలీవుడ్ లో నెపోటిజం అంటూ సూర్య, విజయ్ ల మీద కామెంట్స్ చేసింది, అంతకంటే ముందుగా త్రిష మీద కూడా వాఖ్యలు చేసింది.ఆమె తనకి అవకాశాలు రాకుండా అడ్డుకుందని కామెంట్స్ చేసింది.

ఇలా ప్రతీ సందర్భంలో ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వివాదాలతో సహవాసం చేస్తున్న మీరా మిథున్ మరో సారి హాట్ కామెంట్స్ తో కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది.

తాజాగా మాస్ హీరో విశాల్ ను టార్గెట్ చేసింది.

విశాల్ గతంలో తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, రెండు, మూడేళ్ళ నుండి అడుగుతున్నాడని మీరా చెప్పింది.అంతేకాదు తన తల్లికి కూడా విశాల్ అంటే ఇష్టమని, అయితే తనకు సంపన్నుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, అందుకే విశాల్ ను పెళ్లిచేసుకోవడానికి నిరాకరించినట్లు తెలిపారు.

ఇప్పటికే తెలుగమ్మాయిని నిశ్చితార్ధం చేసుకున్న విశాల్ ఇప్పుడు మీరా మిథున్ వాఖ్యలపై ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.విశాల్ చక్ర అనే సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం డిటెక్టివ్ సీక్వెల్ లో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube