మీరా చోప్రా( Meera Chopra ).ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బంగారం.
ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది మీరా చోప్రా.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ ఆ తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.ముఖ్యంగా పొలిటికల్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మొన్నటికి మొన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మీరా చోప్రా మండిపడ్డ సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ పై తీవ్రంగా విమర్శలు చేసింది.సనాతన ధర్మం విషయంలో పవన్ అభిప్రాయాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ కూడా చేసింది.
అయితే ఇప్పుడు మీరా చోప్రా మరోసారి పవన్ కళ్యాణ్ పై( Pawan kalyan ) క్రేజీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయట పెట్టింది.
కాగా తాజాగా ఒక నెటిజన్ పవన్ కళ్యాణ్ ఒక వీడియోని షేర్ చేశారు.ఆ వీడియోలో పవన్ మహిళలకు రిజర్వేషన్ అనే అంశాన్ని 2019 ఎన్నికలప్పుడు ప్రస్తావించడం మాత్రమే కాదు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు.

ఒక నెటిజన్ పవన్ కళ్యాణ్ మహిళల రిజర్వేషన్( womens Reservation ) గురించి ప్రసంగిస్తున్న వీడియో షేర్ చేశాడు.ఆ వీడియోపై స్పందించిన మీరా చోప్రా.ఆయన మనసు నిజంగా బంగారం.ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది అంటూ మీరా చోప్రా పోస్ట్ చేసింది.మీరా చోప్రా పోస్ట్ పై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మీ కోరిక నెరవేరుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అందుకు సంబందించిన పోస్ట్ సోషల్ మీడియలో వైరల్ గా మారింది.







