ప్రముఖ నటి మీనా ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలలో నటించినా ఇప్పుడు మాత్రం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.భర్త మరణం మీనాను ఎంతో బాధ పెట్టిన సంగతి తెలిసిందే.మీనా రెండో పెళ్లి చేసుకుంటారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆమె ఆ ప్రచారాన్ని ఖండించడంతో పాటు ఈ తరహా వార్తలు ప్రచారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
దృశ్యం2 సినిమాకు సీక్వెల్ గా దృశ్యం3 తెరకెక్కుతుండగా త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.మరోవైపు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లకు కూడా మీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అయితే మీనా తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారని సమాచారం.
క్రేజ్ ఉండటం, ఆఫర్లు అంతకంతకూ పెరుగుతుండటం, రోజురోజుకు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో మీనా తన పారితోషికాన్ని పెంచాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమాకు 20 లక్షల రూపాయల రేంజ్ లో మీనా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.
గతంతో పోల్చి చూస్తే మీనా భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ ను పెంచారని సమాచారం.అయితే కూతురి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూడా మీనా పారితోషికం విషయంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మీనా రెమ్యునరేషన్ ను పెంచినా దర్శకనిర్మాతలు మాత్రం ఆమెకే అవకాశాలు ఇస్తామని చెబుతున్నారని బోగట్టా.సాఫ్ట్ రోల్స్ లో మీనా స్థాయిలో మెప్పించడం చాలామంది నటీమణులకు సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.స్టార్ హీరోల ప్రాజెక్ట్ లలో వరుస ఆఫర్లు వస్తే మాత్రం మీనా స్థాయి మరింత పెరుగుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.







