దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు( Diwali celebrations ) అంబరానంటాయి.పిల్లలు అదే విధంగా పెద్దలు.
దీపావళి వేడుకలలో టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే మేడ్చల్ మల్కాజ్ గిరి( Medchal Malkaz Giri ) దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.
PVN నగర్ కాలనీలో టపాసులు వెలిగిస్తుండగా మంటలు అంటుకొని భర్త మృతి చెందగా.భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేయడం జరిగింది.తీవ్ర గాయాలు పాలైన భార్యను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలియజేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో సైతం బాపట్ల లో ఓ రాకెట్ ఎగిరి వచ్చి పడటంతో.
ఓ గుడిసె పూర్తిగా దగ్ధమైంది.అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది. టపాసుల ధరలు భారీగా పెరిగాయి.
అయినా గాని కొనుగోలుదారులతో బాణాసంచా దుకాణాలు నిండిపోయాయి.ఏమాత్రం ఖర్చుకి వెనకాడకుండా భారీ ఎత్తున టపాసులు కొనుగోలు చేయడం జరిగింది.
దీంతో ఆదివారం దేశవ్యాప్తంగా దీపావళి పండుగ ఘనంగా జరిగింది.







