ప్రముఖ గణిత మేధావి టెడ్ జాన్ కాజిన్‌స్కీ( Ted John Kaczynski ) మృతి చెందాడు.జైలు జీవితం గడుపుతూ అక్కడే మరణించాడు.
హార్వర్డ్ యూనివర్సిటీలో జీనియస్‌గా నిలిచిన ఆయన.మిచిగాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ డిగ్రీని సంపాదించాడు.కాలిఫోర్నియా యూనివర్సిటీలో( University of California ) ఫ్రొఫెసర్‌గా కూడా పనిచేశాడు.చిన్నతనంలోనే ఎన్నో బాంబులు తయారుచేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులపై బాంబు దాడులు చేశాడు.
అతడు చేసిన బాంబు దాడుల్లో ఎంతోమంది చనిపోయారు.దీంతో అతడిపై ఉగ్రవాదిగా ముద్ర వేసి జైల్లో పెట్టారు.
1996లో కాజిన్‌స్కీని అరెస్ట్ చేయగా.అతడికి 30 ఏళ్ల జైలు శిక్షతో పాటు నాలుగు కేసుల్లో జీవితఖైదు విధించారు.దీంతో జైలు జీవితం గడుపుతూ 81 ఏళ్ల వయస్సులో శనివారం మరణించాడు.దాదాపు 17 ఏళ్ల పాటు బాంబు దాడులో అమెరికాను కాజిన్‌స్కీ గడగడలాడించాడు.అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు.అతడిని పట్టుకోవడానికే చాలా సంవత్సరాల సమయం పట్టింది.
అమెరికాలోని మోంటానాలోనే కాజిన్‌స్కీ నివాసం ఉండేవాడు.అక్కడ కరెంట్.
నీరు సదుపాయం లేకపోవడంతో ఒక రిమోట్ ఏరియాలో భూమి కొనుగోలు చేసి ఉండేవాడు.అయితే ఆ చుట్టుపక్కల అడవులను కొంతమంది నాశనం చేయడం అతడికి నచ్చలేదు.
దీనికి చెక్ పెట్టేందుకు పర్యావరణానికి హాని కలిగించే వ్యక్తులపై బాంబు దాడులు చేసేవాడు.మెయిల్ బాంబులతో దాడికి పాల్పడేవాడు.అతడి దాడిలో ముగ్గురు చనిపోగా.23 మంది గాయపడ్డారు.
అతడిని పట్టుకునేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కొన్నేళ్లపాటు తీవ్ర ప్రయత్నాలు చేసింది.అత్యంత కష్టం మీద అతడిని అరెస్ట్ చేశారు.అరెస్ట్ కాకముందు కాజిన్ స్కీ 1995లో న్యూయార్క్ టైమ్స్‌కి అతడు ఒక లేఖ పంపాడు.35 వేల పదాలతో కూడిన తన మ్యానిఫెస్టోను ప్రచురిస్తే ఉగ్రవాదాన్ని వదిలేస్తానని లేఖలో పేర్కొన్నాడు.