ట్విటర్లో తొలగించతగిన ఉద్యోగుల జాబితాను రేపటికల్లా సిద్ధం చేయాలని మేనేజర్లకు ఎలాన్ మస్క్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.ట్విటర్ను సొంతం చేసుకున్న మస్క్.
ప్రస్తుతం ఉద్యోగుల కోతపై దృష్టి పెట్టారు.ట్విటర్లో 7,500 మందికిపైగా ఉద్యోగులున్నారు.
ఇప్పటికే ట్విటర్ CEO పరాగ్ అగర్వాల్ సహా నలుగురు ఉన్నత ఉద్యోగులను తొలగించారు.ఇతర విభాగాల్లోనూ ఉద్యోగుల కోత భారీగానే ఉంటుందని భావిస్తున్నారు.