మారటోరియం గడువు మరోసారి కేంద్రం పెంచుతుందా...?!

తాజాగా మారటోరియం పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

అయితే ఈ పిటిషన్ పై పూర్తి స్థాయి వాదనను బుధవారం వింటామని అత్యున్నత న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

మారటోరియం గడువు గత నెల ఆగస్టు 31తో ముగిసింది.కరోనా వల్ల మార్చి నుంచే లాక్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయవాది విశాల్ తివారీ మారటోరియం గడువు తేదీని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడగించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానానికి పిటిషన్ దాఖలు చేశారు.

కరోనా విజృంభణతో ప్రపంచదేశాలు కుదేలయ్యాయి.దేశ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

కరోనా వ్యాప్తితో ప్రజలు ఆర్థికంగా దెబ్బ తిన్నారు.ఈ సమయంలో ఈఎంఐలు, అదనపు వడ్డీలు, పెనాల్టీలు విధించరాదని న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

మార్చి నుంచి దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో మారటోరియం గడువును కూడా పెంచాలని కోరారు.

మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మారటోరియంను వచ్చే ఏడాది వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలసుస్తోంది.కేంద్రం భారతీయ రిజర్వు బ్యాంకుకు సంబంధించిన అన్ని లోన్లపై రెండేళ్ల పాటు మారటోరియం విధించవద్దని స్పష్టం చేశారు.దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది.2021 మార్చి నెల వరకు మారటోరియం గడువును పెంచేందుకు ప్రణాళిక రచిస్తోంది.లాక్ డౌన్ పీరియడ్ లో కట్టాల్సిన ఈఎంఐలు, అదనపు వడ్డీలను, పెనాల్టీలను విధించకూడదన్నారు.

దీంతో కేంద్రం అన్ని రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం పొడగిస్తామని చెప్పింది.దీంతో మారటోరియం చెల్లించాల్సిన వారికి కొంత ఉపశమనం లభించిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఆగస్టు 31వ తేదీన ముగియనున్న మారటోరియంను డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది.పూర్తి స్థాయిలో వాదనలు వినడానికి రేపటికి సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు