న‌వంబ‌ర్ 5లోపు బ్యాంకు ఖాతాల్లో క్యాష్‌బ్యాక్

మార‌టోరియం కాలానికి సంబంధించిన‌ రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేయ‌నున్నట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.రూ.

2 కోట్ల వ‌ర‌కు ఉన్న రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.ఈ విష‌యాన్ని సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో కూడా కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది.

మార‌టోరియం కాలానికి సంబంధించిన రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేయాల‌ని సుప్రీంకోర్టులో అనేక పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి.ఈ పిటిష‌న్ల‌ను స్వీక‌రించిన విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు.మార‌టోరియం కాలంలోని రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల‌తో కేంద్ర ప్ర‌భుత్వం కూడా చ‌క్ర‌వ‌డ్డీ మాఫీ చేసేందుకు ముందుకొచ్చింది.అయితే చ‌క్ర‌వ‌డ్డీని క్యాష్‌బ్యాక్ రూపంలో ల‌బ్ధిదారుల బ్యాంకు అకౌంట్ల‌లో నేరుగా జ‌మ చేస్తామ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

Advertisement

న‌వంబ‌ర్ 5వ తేదీలోగా ఈ క్యాష్‌బ్యాక్‌ను ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్లు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ఈ మేర‌కు అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌కు కేంద్రం స్ప‌ష్టం చేస్తూ నోటిఫికేష‌న్ జారీ చేసింది.

క‌రోనా ప్ర‌భావం, లాక్‌డౌన్ కారణంగా కంపెనీల‌న్నీ మూత‌ప‌డ‌టంతో చాలామంది ఉద్యోగాలు పోయాయి.దీంతో మార్చి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు లోన్ల ఈఎంఐల‌పై మార‌టోరియం విధిస్తూ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణ‌యం తీసుకుంది.

అయితే మార‌టోరియం కాలంలో చెల్లించ‌ని రుణాల‌పై త‌ర్వాత వ‌డ్డీ ప‌డుతుంది.దీంతో వీటిని మాఫీ చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి? దీన్ని ఎందు కోసం ఉపయోగిస్తారో తెలుసా..?

Advertisement

తాజా వార్తలు