స్మశానంలో పుట్టినరోజు జరుపుకున్న స్టార్ హీరోయిన్.. రీజన్ ఏంటంటే?

సాధారణంగా ఎవరైనా తమ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకోవాలని అనుకుంటారు.సెలబ్రిటీలు అయితే పుట్టినరోజును మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.

 Marathi Actress Aarya Ghare Cut The Birthday Cake In The Creamatorium Details Here, Aarya Ghare, Birthday Celebrations, Creamatorium , Photos Viral-TeluguStop.com

అయితే ప్రముఖ హీరోయిన్ ఆర్యా ఘారే మాత్రం స్మశానంలో పుట్టినరోజు జరుపుకున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్యా ఘారేకు నటిగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ హీరోయిన్ కు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Marathi Actress Aarya Ghare Cut The Birthday Cake In The Creamatorium Details Here, Aarya Ghare, Birthday Celebrations, Creamatorium , Photos Viral-స్మశానంలో పుట్టినరోజు జరుపుకున్న స్టార్ హీరోయిన్.. రీజన్ ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్మశానంలో పుట్టినరోజు జరుపుకున్న ఆర్యా ఘారేకు పిచ్చి పట్టిందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తే మరి కొందరు ఈ హీరోయిన్ కు పుట్టినరోజు జరుపుకోవడానికి మరే స్థలం దొరకలేదా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని ఈ నటి సినిమాలతో పాటు సీరియళ్ల ద్వారా కూడా బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం.

స్మశానంలో పుట్టినరోజు జరుపుకోవడం గురించి ఆర్య ఘారే మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ మూడు నమ్మకాలకు వ్యతిరేకంగా ఒక సినిమాలో నటిస్తుండటం గమనార్హం.స్మశానంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ద్వారా తన సినిమాకు కూడా ప్రమోషన్స్ జరుగుతాయని ఆర్యా ఘారే భావిస్తుండటం గమనార్హం.

మహారాష్ట్రలోని పుణె దగ్గర ఉన్న ఒక స్మశానంలోపుట్టినరోజు వేడుకలు జరిగాయి.

Telugu Aarya Ghare, Creamatorium-Movie

అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఇలాంటి పనులు చేయవద్దని ఆర్యా ఘారేకు సూచనలు చేస్తుండటం గమనార్హం.కొంతమంది మాత్రం ఆర్యా ఘారేను మెచ్చుకుంటూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఈ విధంగా ప్రచారం కల్పించడంలో తప్పు లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.స్మశానం అనే పేరు వింటే చాలామంది కొత్తతరహా అనుభూతికి లోనవుతారనే సంగతి తెలిసిందే.

అలాంటి వాళ్లు మారాలనే ఆలోచనతో ఆర్యా ఘారే ఈ తరహా ప్రయత్నం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube