మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్ ను ఎన్ఐఏ టార్గెట్ చేసింది.ఈ మేరకు గణేశ్ తలపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.
గణేశ్ ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ఏఓబీలో ఎన్ఐఏ వాల్ పోస్టర్లు వెలిశాయి.
మావోయిస్టు కేంద్ర కమిటీలో గణేశ్ కీలక సభ్యుడుగా ఉన్నాడు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన గణేశ్ అసలు పేరు గాజర్ల రవి.1992 లో నక్సల్స్ పార్టీలో చేరిన గణేశ్ 2004లో పీపుల్స్ వార్ ప్రతినిధిగా ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నాడు.గణేశ్ ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ఎన్ఐఏ పోస్టర్లు వేయడం సంచలనంగా మారింది.







