తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు..!!

కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) రెండు రోజుల క్రితం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.ఈ క్రమంలో తెలంగాణలో( Telangana ) నవంబర్ 30న ఎన్నికలు ఉంటాయని డిసెంబర్ మూడో తారీఖున ఫలితాలు విడుదల అని స్పష్టం చేయడం జరిగింది.

 Many Collectors And Sps In Telangana Are Under Ec , Telangana, Election Commissi-TeluguStop.com

దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా ఈసీ.తెలంగాణలో పలువురు కలెక్టర్లు మరియు ఎస్పీ లపై వేటు వేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్రనికి చెందిన నలుగురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది.

రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇదే సమయంలో 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీకి ఆదేశాలు జారీ చేసింది.

రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ బదిలీకి ఈసీ ఆదేశాలు.వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బదిలీకి ఈసీ ఆదేశాలు.

ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ల బదిలీకి కూడా ఈసీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎలక్షన్ కమిషన్ ఈ రీతిగా బదిలీలు చేయటం.తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది.

మరోపక్క ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలలో భారీగా నగదు, బంగారం పట్టుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube