నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?

కాలం మారుతున్నప్పటికీ, కొన్నిచోట్ల ఇటువంటి దారుణమైన సంఘటనలు ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి.

ఎదుటివారి బలహీనత కారణంగానో, పేదరికం కారణంగానూ కొంతమంది కేటుగాళ్లు ( Fraudsters ) పేట్రేగిపోతున్నారు.

ఎంత బలమైన చట్టాలు అమలు అవుతున్నప్పటికీ ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు అలాంటి వారికి బలి కావలసి వస్తోంది.తాజాగా ఇటువంటి ఓ సంఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.పెద్దపల్లి జిల్లా, మంథని( Manthani ) గ్రామంలోని ఓ ప్రభుత్వ బాలుర వసతి గృహంలోని ఈ సంఘటన చోటుచేసుకుంది.ఆ వసతి గృహం లోని ఒక యువతి పేదరికాన్ని గమనించిన వంట మనిషి ఆమెపై కన్నేసి మచ్చిక చేసుకుంది.

అందరిలాగానే తనకి వడ్డిస్తున్నప్పుడు కొసరి కొసరి అన్నాన్ని ఎక్కువగా వడ్డిస్తూ కపట ప్రేమని కురిపించింది.మామూలుగా ఒక కోడిగుడ్డు ఇవ్వడానికి బదులు రెండు మూడు కోడిగుడ్లు ఆమెకి ఎరగా వేస్తూ సొంత కుటుంబ సభ్యుని వలె సాకడంతో ఆ యువతి ఆ వంట మనిషిని బాగా నమ్మింది.

Advertisement

ఈ క్రమంలోనే ఒకనాడు సదరు వంటమనిషి ఆమెని దగ్గరకి పిలిచి, ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా పూజలు చేసినట్లయితే, పూర్తిగా దరిద్రం పోతుందని నమ్మబలికింది.అలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి( Lakshmi Devi ) తాండవం చేస్తుందని ఆ యువతని మభ్యపెట్టింది.ఈ క్రమంలోనే ఒకరోజు సదరు యువతిని తన గదిలోకి పిలిచి, అప్పటికే అందులో వేచి ఉన్న ఒక ప్రబుద్ధుడు ముందు నగ్నంగా ఉండమని, పూజకు( Pooja ) సిద్ధం కమ్మని చెప్పింది.

దాంతో కాస్త తెలివిగా ఆ యువతి వారి చెర నుండి తప్పించుకొని వారి బంధువుల ఇంటికి పరుగెత్తుకుని వెళ్ళిపోయింది.ఇక విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ఆ వంట పనిమనిషి పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, సదరు హాస్టల్ కి చేరుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు