పెద్దపల్లి జిల్లాలోని మంథని మున్సిపాలిటీ( Manthani Municipality )లో ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో కాంగ్రెస్ నెగ్గింది.ఈ మేరకు పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ సతీమణి, మంథని మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజపై అవిశ్వాసం నెగ్గింది.
ఈ నెల ఒకటో తేదీన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానం( No Confidence Motion )పై సంతకాలు చేసి పత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ కు సమర్పించారు.
పదిహేను రోజుల గడువు అనంతరం ఇవాళ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మంథని ఆర్టీవో పర్యవేక్షణలో అవిశ్వాస ప్రక్రియను నిర్వహించారు.

మంథని మున్సిపాలిటీలో మొత్తం 13 మంది కౌన్సిలర్లు ఉండగా.అవిశ్వాసానికి తొమ్మిది మంది కౌన్సిలర్లు మద్ధతు తెలిపారు.కాగా మున్సిపాలిటీలో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉండగా కొద్ది రోజుల క్రితం మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో బీఆర్ఎస్ కు చెందిన మరో ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
దీంతో మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ( Putta Sailaja )పై అవిశ్వాసంలో కాంగ్రెస్ నెగ్గింది.







