త్రిషకు నేను సారీ చెప్పడం ఏంటి... ఇదొక పెద్ద జోక్: మన్సూర్ అలీ ఖాన్?

సినీ నటి త్రిష ( Trisha ) విషయంలో మన్సూర్ అలీ ఖాన్ ( Mansoor Ali Khan ) చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.ఇదివరకు ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

 Mansoor Ali Khan Says Apologising Trisha Biggest Joke , Mansoor Ali Khan, Tr-TeluguStop.com

అయితే ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది సెలెబ్రేటీలు ఆయనపై విమర్శలు చేయడమే కాకుండా త్రిషకు మద్దతుగా నిలబడ్డారు.ఇలా వారం రోజులపాటు త్రిష మన్సూర్ మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి.

అయితే ఈ వివాదానికి చెక్ పెడుతూ మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు ( Apology )చెబుతున్నట్టు పెద్ద ఎత్తున లేక కూడా రాసి విడుదల చేశారు.గత వారం రోజులుగా కత్తి లేకుండా యుద్ధం చేస్తున్నానని అయితే ఈ యుద్ధంలో తానే గెలిచాను అంటూ ఈయన క్షమాపణలు చెబుతూ లేక విడుదల చేశారు.

Telugu Apology, Chiranjeevi, Kollywood, Leo, Tollywood, Trisha-Movie

ఇకపోతే తన వీడియోని ఎవరో ఎడిటింగ్ చేసి అలా విడుదల చేశారని తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు అంటూ ఈయన వివరణ కూడా ఇచ్చారు.అదేవిధంగా వారం రోజులుగా తనపై ఇలాంటి విమర్శలు చేస్తూ తన పరువుకు భంగం కలిగించినటువంటి కుష్బూ త్రిషా చిరంజీవి( Chiranjeevi ) పై పరువు నష్టం దావా కూడా వేస్తున్నట్లు ఈయన వెల్లడించారు.అయితే తాజాగా మరోసారి ఈ వివాదంపై మన్సూర్ అలీఖాన్ స్పందిస్తూ త్రిషకు నేను క్షమాపణలు చెప్పలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Apology, Chiranjeevi, Kollywood, Leo, Tollywood, Trisha-Movie

నేను నా మేనేజర్ కు ఫోన్ చేసి క్షమాపణలు చెబుతున్నట్లు ఎక్కడ చెప్పలేదని నేను తనకు ఫోన్ చేసి నన్ను చంపేయండి అని చెప్పాను కానీ అతనికి క్షమించండి అని వినిపించినట్టు ఉంది అందుకే లేఖలో అలా రాసారని ఈయన మాట మార్చారు.ఇలా నేను త్రిషకు క్షమాపణలు చెప్పడం అనేది పెద్ద జోక్ అంటూ ఈ సందర్భంగా మనస్సు మరోసారి ఈ వివాదం పై చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇలా త్రిష మౌనంగా ఉన్నప్పటికీ ఈయన మాత్రం ప్రతిరోజు ఈ వివాదంపై ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.

మరి ఈ వివాదం ఇప్పటికైనా ముగుస్తుందా లేదా మరింత దూరం వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube