కోలీవుడ్ ప్రేమ జంట మంజీమా మోహన్ గౌతమ్ కార్తిక్ గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటూ ఎట్టకే లకు నవంబర్ 28వ తేదీ పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఈ ప్రేమ పక్షులు గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో విహరిస్తూ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసే పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే మరి కొంతమంది నటి మంజీమా బాడీ షేమింగ్ గురించి దారుణమైన ట్రోల్స్ చేశారు.
ఈ విధంగా ఈమె తన శరీరాకృతి గురించి ఇప్పుడు కాకుండా గతంలో కూడా ఎన్నోసార్లు ఈ విధమైనటువంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన బాడీ షేమింగ్ గురించి వచ్చిన ట్రోల్స్ గురించి మాట్లాడుతూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.చాలామంది నా శరీరాకృతి గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.ఇప్పుడు మాత్రమే కాకుండా గతంలో కూడా ఇలా నా శరీరాకృతి గురించి భారీ ట్రోల్స్ జరిగాయి అయితే ఇకపై ఇలాంటివి నాపై ఏ విధమైనటువంటి ప్రభావం చూపించవు అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నేను నా శరీరాకృతితో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాను.నేను ప్రస్తుతం చాలా ఫిట్ గా ఉన్నాను.ఒకవేళ అవసరం అనుకుంటే తప్పనిసరిగా నా శరీర బరువు తగ్గుతానని ఈమె తెలిపారు.
నా శరీరంతో నేను సౌకర్యవంతంగా ఉన్నప్పుడు నేను లావుగా ఉండడం ఇతరులకు ఎందుకు అసౌకర్యవంతంగా ఉందో నాకు తెలియడం లేదు అంటూ ఈమె తన బాడీ షేమింగ్ గురించి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.