టాలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం( Director Maniratnam ) గురించి ఆయన సినిమాలకు ఉన్న ఫ్యాన్స్ బేస్ గురించి మనందరికీ తెలిసిందే.కాగా మణిరత్నం దర్శకత్వంలో గత ఏడాది పొన్నియిన్ సెల్వన్( Ponniyin Selvan ) సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 30 2022న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ పర్వాలేదు అనిపించేలా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను తమిళంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో విడుదల ఆయినా ఈ మూవీ అన్ని ప్రాంతాలనుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.కాగా ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం.ఇదిలా ఉంటే ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సెకండ్ పార్ట్( Ponniyin Selvan 2 ) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే పొన్నియన్ సెల్వన్ 2 నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మణిరత్నం.ఈ సినిమా ట్రైలర్ డేట్ నుంచి అనౌన్స్ చేశారు.

ఈ మేరకు ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు.ఈ మూవీ ట్రైలర్ ను మార్చి 29న విడుదల చేయనున్నారు.తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో విక్రమ్, ఐశ్వర్య రాయ్ లతో డిజైన్ చేశారు.తాజాగా ఐశ్వర్య ఈ పోస్టర్ ను షేర్ చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు.పార్ట్ 2 అయిన సక్సెస్ అవుతుందా లేకుంటే ఫ్లాప్ అవుతుందా అంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.







