పాయల్ రాజ్ పూత్( Payal Rajput ) కీలక పాత్ర లో అజయ్ భూపతి దర్శకత్వం లో రూపొందిన మంగళవారం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా కు స్టార్స్ ప్రమోషన్ చేస్తూ ఉంటే అంత సీన్ ఉందా అని అంతా అనుకున్నారు.
ప్రచారం కు తగ్గట్లుగా సినిమా కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు చేస్తుందని అంతా భావించారు.అనుకున్నట్లుగానే సినిమా కు మంచి పబ్లిసిటీ దక్కింది.
విడుదల తర్వాత సినిమా కు మంచి మౌత్ టాక్ లభించింది.దాంతో సినిమా కు వసూళ్లు కూడా భారీగా వచ్చాయి అంటూ సమాచారం అందుతోంది.

ఇక థియేటర్ ల ద్వారా మంగళవారం( Mangalavaram ) వచ్చి నెల రోజులు అవ్వబోతుంది.ఈ వారంలోనే సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నారు.కానీ తాజాగా సోషల్ మీడియా లో వచ్చే వారం మంగళ వారం నాడు సినిమా ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.మంగళవారం సినిమా ను మంగళవారం స్ట్రీమింగ్ చేస్తే బాగుంటుందని కొందరు భావిస్తున్నారట.

అందుకే ఈ సినిమా స్ట్రీమింగ్ విషయం లో కొత్త సెంటిమెంట్ కు నిర్మాత లు తెర తీశారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యం లో దర్శకుడు అజయ్ భూపతి( Ajay Bhupathi ) మంగళవారం స్ట్రీమింగ్ పై వస్తున్న పుకార్ల కి స్పందించాడు.మంగళవారం సెంటిమెంట్ తో స్ట్రీమింగ్ చేయాలనే నిర్ణయం ను తీసుకోలేదు అన్నాడు.అంతే కాకుండా సినిమా స్ట్రీమింగ్ కి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
మంగళవారం సినిమా ను ఓటీటీ ద్వారా చూడాలని చాలా మంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.వారందరి కోసం ఓటీటీ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.థియేటర్ లో ఎలా అయితే విజయాన్ని సొంతం చేసుకుందో అలాగే ఓటీటీ లో కూడా సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.