మంచు విష్ణు ( Manchu Vishnu ) ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’.( Kannappa ) ఈ సినిమా లో ఆయన హీరో గా నటిస్తూనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
దాదాపు దశాబ్ద కాలం గా మంచు విష్ణు ఈ సినిమా గురించి చర్చలు జరుపుతూనే ఉన్నాడు.తన డ్రీమ్ ప్రాజెక్ట్ ల్లో ఒకటి గా చెప్పుకుంటూ వచ్చిన మంచు విష్ణు ఎట్టకేలకు తన సినిమా ను మొదలు పెట్టాడు.
అయితే ఈ సినిమా లో భారీ ఎత్తున స్టార్ కాస్టింగ్ ను చూపించబోతున్నాడు.
ఇక విదేశాల్లో షూటింగ్ చేస్తున్నాడు.
గ్రాఫిక్స్ వర్క్ కోసం భారీ ఎత్తున ఖర్చు చేయబోతున్నాడు.మొత్తంగా ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లో ఇప్పటి వరకు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాల బడ్జెట్ తో పోల్చితే రెండు మూడు రెట్లు అధికంగా ఉంటుందని అంటున్నారు.
విష్ణు సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా పాతిక కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించగలదు.అలాంటిది కన్నప్ప సినిమాను దాదాపుగా 175 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించడం చర్చనీయాంశంగా మారింది.

ముందు గా ఈ సినిమా కు రూ.150 కోట్లు అనుకున్నారు.మేకింగ్ సమయంకు 175 కోట్లు గా మారింది.మేకింగ్ పూర్తి అయ్యి విడుదల సమయం కు కచ్చితం గా సినిమా రూ.200 కోట్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరీ ఈ రేంజ్ లో మంచు విష్ణు సినిమాకి( Manchu Vishnu Movie ) వర్కౌట్ అయ్యేనా అంటే కచ్చితంగా వర్కౌట్ అవుతుంది అంటున్నారు.

కన్నప్ప బడ్జెట్( Kannappa Budget ) విషయం లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.దేశ వ్యాప్తంగా కూడా ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేస్తాం.అంతే కాకుండా సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున సక్సెస్ చేసుకుంటాం అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.అందుకే ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు అంటున్నారు.
మంచు విష్ణు ప్రముఖ కార్పోరేట్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడట.