హమ్మయ్య ఎట్టకేలకు హీరో మంచు మనోజ్ భూమా మౌనికలు పెళ్లి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.ఎప్పటినుంచో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు మనోజ్ భూమా మౌనికల పెళ్లి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ వార్తలపై మంచు ఫ్యామిలీ కానీ భూమా మౌనిక కానీ మనోజ్ కానీ స్పందించలేదు.దాంతో చాలా వరకు నెటిజెన్స్ అభిమానులు అవి వట్టి రొమాన్స్ మాత్రమే అని అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత మంచు మనోజ్ మౌనిక కలిసి పలుసార్లు కలిసి కనిపించడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.
ఇక ఎట్టకేలకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలన్నీ నిజం చేస్తూ మౌనిక మనోజ్ లు వివాహ బంధంతో ఒకటయ్యారు.కాగా వీరి పెళ్లి ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు పలువురు ప్రముఖులు సైతం హాజరయ్యారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ పెళ్లికి మొదట మంచు ఫ్యామిలీ వారు హాజరు కారు అంటూ వార్తలు వినిపించాయి.కానీ మంచు ఫ్యామిలీ మొత్తం మనోజ్ పెళ్లికి హాజరయ్యారు.
అయితే మంచు విష్ణు మాత్రం ఆ పెళ్లికి తనకు పెళ్ళికొడుకు తనకు ఏమి సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మంచు విష్ణు పెళ్లికి కేవలం అతిథిలా వచ్చి వెళ్లడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.భార్య, పిల్లలతో తమ్ముడి పెళ్లికి వచ్చిన విష్ణు ఇంటి వ్యక్తిలా కాకుండా కేవలం గెస్టులా కొద్ది సమయం మాత్రమే పెళ్లిలో ఉండి వెంటనే వెళ్లిపోయాడు.ఇది చూసిన నెటిజన్లు సైతం షాక్ అయ్యారు.
కొందరు మంచు అభిమానులు మంచు విష్ణు పై మండిపడుతున్నారు.అలా చేయడం కరెక్ట్ కాదు అంటూ విష్ణు పై విమర్శలు గుప్పిస్తున్నారు.
మంచు మనోజ్ పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వగా అందులో మోహన్ బాబు అతని భార్య కనిపించారు కానీ మంచు విష్ణు కానీ ఆయన భార్య పిల్లలు ఫ్యామిలీ కానీ ఎవరు కనిపించలేదు.దీంతో ప్రస్తుతం మంచు వారి వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది
.