టాలీవుడ్ కు చెందిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ అంతా కూడా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు.ఆ మధ్య ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి ఉంటుందని చెప్పిన యంగ్ హీరో శర్వానంద్ కూడా పెళ్లికి సిద్ధం అయ్యాడు.
పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాడు.ఇటీవలే వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది.
అతి త్వరలోనే శర్వానంద్ పెళ్లి జరగబోతుంది.హీరోగా ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు.
కానీ పెళ్లి విషయంలో మాత్రం అస్సలు ఆసక్తి చూపించడం లేదు.ఇటీవలే మంచు మనోజ్ రెండవ వివాహం చేసుకున్నాడు.
కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న మంచు మనోజ్ రెండవ పెళ్లి విషయంలో మొదట ఆసక్తి చూపించలేదు.కాని స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డి తో వివాహానికి సిద్ధం అయ్యాడు.
గత ఏడాది నుండి జరిగిన ప్రచారంకు ఫుల్ స్టాప్ పెట్టి తాజాగా మనోజ్ మరియు మౌనిక రెడ్డి లు పెళ్లి పీఠలు ఎక్కారు.వీరి పెళ్లి వార్తలు రెండు మూడు రోజులు మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

మనోజ్ పెళ్లి హడావుడి పూర్తి అయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఎప్పుడు ప్రభాస్ పెళ్లి అంటూ మళ్లీ ప్రశ్నించడం మొదలు పెట్టారు.ప్రభాస్ పెళ్లి విషయంలో అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆ మధ్య అనుష్క మరియు ప్రభాస్ ప్రేమలో ఉన్నారు అనే ప్రచారం జరిగింది.కానీ ఆ తర్వాత ఇద్దరు కూడా మంచి స్నేహితులే అని తేలిపోయింది.

అయితే ఇద్దరు కూడా పెళ్లికి ఇప్పటి వరకు ఓకే చెప్పక పోవడం పట్ల పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికైనా వెంటనే ప్రభాస్ పెళ్లి పై నిర్ణయం తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది ఉంటుందా అనేది క్లారిటీ లేదు.కనీసం 2025 సంవత్సరం వరకు అయినా ప్రభాస్ పెళ్లి జరుగుతుందా అనేది చూడాలి.







