ఎన్టీఆర్ వెయ్యి కోతులతో సమానం

మీరూ గనుక ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే, టైటిల్ చూసి, ఎవరు అన్నది, అడ్రెస్స్ ఇవ్వండి వెళ్లి చూసుకుంటా అన్న రేంజ్ లో ఆవేశపడకండి.

ఎన్టీఆర్ ని కోతి అన్నది మెగా ఫ్యానో , మహేష్ ఫ్యానో కాదు.

ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండ్ అయిన మంచు మొనోజ్ అన్నాడు.మనోజ్ అయితే ఏంటి అలా అనేస్తాడా అని మళ్ళి ఆవేశపడకండి.

సరదాగానే అన్నాడు.ఎంత సరదా అయితే ఏంటి కోతులతో సమానం అనడం ఏమిటో మళ్ళి మళ్ళి ఊగిపోకండి.

మొదట మనోజ్ ని కోతులతో పోల్చింది ఎన్టీఆరే.

Advertisement
కాని వీళ్ళిద్దరు ఎదో కోపంలో ఒకరిని ఒకరు కోతులతో పోల్చుకోలేదు.

సరదాగానే అనుకున్నారు.ఇద్దరు మంచి స్నేహితులు, ఒకరినొకరు వాడు వీడు, ఏరా అనుకునేంత స్నేహం ఉంది వీరిమధ్య.

ఇద్దరు ఒకే రోజున ( మే 20 , 1983 ) జన్మించడం విశేషం.ఆ మధ్య ఒక ఇంటర్వ్యులో ఎన్టీఆర్ మాట్లాడుతూ మనోజ్ టాపిక్ రాగానే మనోజ్ చేసే అల్లరి వంద కోతులతో సమానం అన్నాడు నవ్వుకుంటూ.

ఈ విషయాన్ని గుర్తు ఒక ఎన్టీఆర్ అభిమాని మనోజ్ కి ట్వీట్ చేస్తే వెంటనే మనోజ్ " నేను వంద కోతులు అంటే , వాడు వెయ్యి కోతులతో సమానం" అంటూ పంచ్ వేసి స్వీట్ రివెంజ్ తీసుకున్నాడు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు