నువ్వు కొనిచ్చావా.. నీకేమిరా నొప్పి.. ఆ బ్రతుకు ఒక బ్రతుకేనా.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు వైరల్!

వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ సెలబ్రిటీలలో మంచు లక్ష్మి( Manchu Lakshmi ) ఒకరు.

సోషల్ మీడియాలో తన గురించి నెగిటివ్ కామెంట్లు వచ్చినా ఆ కామెంట్లను మంచు లక్ష్మి పెద్దగా పట్టించుకోరు.

ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసిన మంచు లక్ష్మి ఆ వీడియోలో అందరికీ నమస్కారం అని ఇటీవల ఎయిర్ పోర్ట్ లో కార్పెట్ శుభ్రంగా లేదని వీడియో పెట్టానని ఆమె తెలిపారు.నా ఐ ఫోన్ తో( iPhone ) తీసిన వీడియో కావడం వల్ల ఇంకా బాగా కనపడుతుందని నేను అన్నానని ఆమె పేర్కొన్నారు.

అయితే ఆ వీడియో గురించి నెటిజన్లు నీకు ఐ ఫోన్ ఉందా? బిజినెస్ క్లాస్ లో వెళ్తున్నావా అని కామెంట్ చేస్తున్నారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.నేను బిజినెస్ క్లాస్ లో( Business Class ) ట్రావెల్ చేయడం, నాకు ఐ ఫోన్ ఉండటం తప్పు అనే విధంగా ప్రచారం చేస్తున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

Manchu Laxmi Sensational Comments Goes Viral In Social Media Details, Manchu Lax

అలా కామెంట్లు చేసిన వాళ్లను నువ్వు కొనిచ్చావా అంటూ మంచు లక్ష్మి రివర్స్ లో ప్రశ్నించారు.నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు అని నీకేమిరా నొప్పి? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? అంటూ ఆమె ప్రశ్నించారు.నాకు సొంతంగా విమానం కావాలని మీకు వద్దా అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.

Advertisement
Manchu Laxmi Sensational Comments Goes Viral In Social Media Details, Manchu Lax

మీకు అన్నీ తప్పులే కనబడుతున్నాయని ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదా అని మంచు లక్ష్మి కామెంట్లు చేశారు.

Manchu Laxmi Sensational Comments Goes Viral In Social Media Details, Manchu Lax

సోషల్ మీడియాలో( Social Media ) ఏదీ పోస్ట్ చేయకూడదా అని ఆమె అన్నారు.డబ్బు సంపాదించడానికి నేను కష్టపడతానని మా అమ్మానాన్న కష్టపడటం నేర్పించారని వాళ్లు నాకు డబ్బులు ఇవ్వరని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.డబ్బు మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుందని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

వేరే వాళ్ల కోసం బ్రతికే బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని ఆమె అన్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు