టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన మంచు మనోజ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మనోజ్ సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు.
అయితే మనోజ్ మొదటి భార్యతో విడిపోగా మనోజ్ భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకోనున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వైరల్ అయ్యాయి.
గతంలో రెండో పెళ్లి వార్తలను ఖండించిన మంచు మనోజ్ భూమా మౌనికతో పెళ్లి వార్తలను మాత్రం ఖండించకపోవడంతో వైరల్ అయిన పెళ్లి వార్తలు నిజమేనని క్లారిటీ వచ్చింది.
అయితే మనోజ్ రెండో పెళ్లి గురించి తాజాగా మంచు లక్ష్మి స్పందించారు.మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటానని చెబితే నేనేం అంటానండీ బాబు అంటూ మంచు లక్ష్మి కామెంట్లు చేశారు.
ఎవడి దూ* వాడిదని ఎవడి బ్రతుకు వాళ్లను బ్రతకనీయండని ఆమె చెప్పుకొచ్చారు.
హానెస్ట్ లవ్ ను నేను బ్లెస్ చేస్తానని మంచు లక్ష్మి కామెంట్లు చేశారు.
ఈ విషయంలో తాను సంతోషంగానే ఉన్నానని మంచు లక్ష్మి అన్నారు.లైఫ్ లో రెండే రెండు ఎమోషన్లు ఒకటి ప్రేమ రెండోది భయం అని ఆమె చెప్పుకొచ్చారు.
మనం జీవితాన్ని ప్రేమతో లీడ్ చేస్తున్నామా లేక భయంతో లీడ్ చేస్తున్నామా అనేది చాలా ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు.తమ గురించి నెగిటివిటీ ఎక్కడినుంచి వస్తుందో అర్థం కావడం లేదని ఆమె తెలిపారు.

ట్రోల్స్ ద్వారా తాము కూడా పాఠం నేర్చుకున్నామని ఆమె కామెంట్లు చేశారు.మంచు లక్ష్మి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.మనోజ్ పెళ్లికి సపోర్ట్ చేస్తున్నట్టు మంచు లక్ష్మి మాట్లాడినా ఆ కామెంట్లు కొంచెం సెటైరికల్ గా ఉండటం హాట్ టాపిక్ అయింది.







