ఫ్యాషన్ డ్రెస్ లో మంచు లక్ష్మి.. కంగారులో అలా చేయడం మర్చిపోయారంటూ నెటిజన్స్ ట్రోల్స్?

తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి.ఈమె పరిచయం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Manchu Lakshmi In A Fashion Dress Are Netizens Trolling That They Forgo To Do T-TeluguStop.com

మంచు ఫ్యామిలీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలి హీరోయిన్ గా పరిచయమైంది.అలా పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది లక్ష్మి.

ఆ తర్వాత టాలీవుడ్ కి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది.ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.

కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.

గతంలో పలు ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.ఆ తర్వాత అక్కడ నుండి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా చేసింది.

ఈ మధ్య ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం ను కూడా ప్రారంభించింది.ఇందులో తను హోస్టింగ్ చేస్తూ సెలబ్రెటీలతో వంటలు చేయిస్తుంది.

ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.పైగా ఆసనాలు కూడా చేస్తుంది మంచు లక్ష్మి.

వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటుంది.సమయం దొరికితే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చట్లు పెడుతుంది.

తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో కూడా బాగా వీడియోని షేర్ చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు మంచు లక్ష్మి బాగా ట్రోలింగ్స్ కు గురవుతూ ఉంటుంది.కానీ వాటిని అసలు పట్టించుకోదు.

అయినప్పటికీ కూడా ఈమెను ట్రోలర్స్ మాత్రం అసలు వదలరు.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరోసారి ట్రోలింగ్ కు గురైంది లక్ష్మి.అసలు విషయం ఏంటంటే తాజాగా తను.ఒక ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని ఫోటో షూట్ చేయించుకొని దానిని ఇన్ స్టా లో షేర్ చేసుకుంది.అయితే ఆమె డ్రెస్సు చూడటానికి కట్ చేసిన ముక్కలు వేసినట్లుగా అనిపించింది.దీంతో ఆ ఫోటోలో తన డ్రెస్ అవతారని చూసి నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్  చేస్తున్నారు.

కంగారులో మీరు డ్రెస్ కుట్టించుకోవడం మర్చిపోయారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  ప్రస్తుతం ఆ కామెంట్ తో పాటు ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube