మంచు విష్ణు భయ్యా మళ్లీ మళ్లీ ఎందుకు జోకర్ అవుతున్నారు?

సోషల్ మీడియా లో మంచు విష్ణు మరియు ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే.ఒక టాలీవుడ్ స్టార్ హీరో ఈ ట్రోల్స్ ని చేయిస్తున్నాడు అంటూ గతం లోనే మంచు విష్ణు పేర్కొన్నాడు.

20 మంది సాఫ్ట్ వేర్‌ ఎంప్లాయిస్ తో తమ కుటుంబంపై ట్రోల్స్ వేయిస్తున్నారంటూ మంచు విష్ణు ఆ మధ్య సంచలన ప్రకటన చేశాడు.ఆ సమయం లోనే ఆయన్ని చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు.

ట్రోల్స్ ఓ రేంజ్ లో పెరిగాయి అది చాలదు అన్నట్లు మళ్లీ తన జిన్నా సినిమా విడుదల ప్రెస్ మీట్ సందర్భం గా సంచలనం వ్యాఖ్యలు చేశాడు తాను తలుచుకుంటే రాజమౌళి తో సినిమా చేయగలనని, శ్రీరామరాజ్యం సినిమా లో నటించేందుకు చాలా ప్రయత్నించానని ఇంకా ఎన్నో ఎన్నెన్నో వ్యాఖ్యలను మంచు విష్ణు చేశాడు.

ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే ఆయన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆ విషయం తెలిసి కూడా మళ్లీ అవసరమా అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో కొందరు మంచు విష్ణు వారు మళ్ళీ దొరికాడు అంటూ మంచు విష్ణు ని ఏకిపారేసుకుంటున్నారు.

Advertisement

అనవసరం గా మాట్లాడి ఎందుకు భయ్యా మళ్లీ మళ్లీ జోకర్ అవుతారు అంటూ స్వయంగా మంచు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా కాస్త సైలెంట్ గా ఉంటే సోషల్ మీడియా లో కొన్ని రోజులు వచ్చే ట్రోల్స్‌ తగ్గి పోతాయి.

వాటి గురించి స్పందించడం.లేదంటే రకరకాలుగా మాట్లాడ్డం ద్వారా మరింత గా జోకర్ అవుతారు, ప్లీజ్ భయ్యా మాట్లాడకండి అంటూ మంచు ఫ్యామిలీ అభిమానులు మరియు సన్నిహితులు మంచు విష్ణుకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికైనా మంచి విష్ణు తన పద్ధతిని మార్చుకుంటాడేమో చూడాలి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు