టాలీవుడ్ లో చాలా ఫ్యామిలీస్ యొక్క ఆధిపత్యం కనిపిస్తోంది.నందమూరి, మెగా, కృష్ణ, దగ్గుబాటి, అక్కినేని ఇలా పలు ఫ్యామిలీస్ కు చెందిన హీరోలు రెగ్యులర్ గా కాకున్నా అప్పుడప్పుడు అయినా కూడా సక్సెస్ లను దక్కించుకుంటూ ఉన్నారు.
యంగ్ హీరోలు చాలా మంది మంచి విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నారు.ఇలాంటి సమయంలో మంచు హీరోలు మాత్రం చాలా వెనుకపడి ఉన్నారు.
మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా ఉన్నారు.

ఆయన హీరోగా మరియు విలన్ గా కూడా మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.కానీ ఆయన కొడుకులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ లు మాత్రం కెరీర్ లో సెటిల్ అవ్వలేక పోతున్నారు.వీరిద్దరు అన్నదమ్ములు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం అయినా కూడా ఇప్పటి వరకు సక్సెస్ ల విషయంలో పెద్దగా ప్రభావం చూపించలేక పోతున్నారు.

మంచు మనోజ్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది.అసలు ఆయన నుండి ముందు ముందు సినిమా లు వస్తాయా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.ఇక మంచు విష్ణు చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తోంది.ముఖ్యంగా మోసగాళ్లు మరియు జిన్నా సినిమా లు దారుణంగా నిరాశ పర్చాయి.
అయినా కూడా మంచు విష్ణు సినిమా లు చేస్తూనే ఉన్నాడు.ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
ఆ సినిమా లు అయినా సక్సెస్ అవుతాయో లేదో చూడాలి.ఒక వేళ కొడుకులు హీరోలుగా సక్సెస్ కాలేక పోతే మోహన్ బాబు మళ్లీ హీరోగా సినిమాలు మొదలు పెట్టడం మంచిది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.







