తండ్రి చేసిన వీర్యదానం వల్ల పెళ్లి చేసుకోవడానికే భయపడుతున్న కొడుకు..

కొంతమందికి కొన్ని వింత సమస్యలు ఎదురవుతాయి.ఆ సమస్యలు వారికి బాధకలిగించినా వినే వారికి ఒకింత నవ్వు తెప్పించడమే కాకుండా ఆశ్చర్యానికి కూడా గురి చేస్తాయి.

అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే విషయం కూడా.ఒక యువకుడు ప్రేమించాలన్నా డేటింగ్ చెయ్యాలన్నా లేదా పెళ్లి చేసుకోవాలన్నా గజగజ వణుకుతున్నాడు.

ఎందుకు ఎలా చేస్తున్నాడని మీరు ఆశ్చర్య పోతున్నారా అందుకు కారణం ఆ యువకుడు తండ్రే ఆయన వీర్యదానం చేయడం వల్ల ఆ యువకుడు ఏ అమ్మాయిని చూసినా నువ్వు న చెల్లివని చెప్పి అక్కడ నుండి వస్తున్నాడట.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన జావే ఫార్స్ అనే యువకుడు ఇలాంటి వింత సమస్యను ఎదుర్కొంటున్నాడు.ఆ యువకుడు ఏ అబ్బాయిని చుసిన ఏ అమ్మాయిని చుసినా తన సోదరుడో.

Advertisement

లేదా సోదరో అని అనుమానం పడుతున్నాడు.ఎందుకంటే ఆ యువకుడు తండ్రి కుటుంబాన్ని పోషించడం కోసం వింత దారిని ఎంచుకున్నాడు.

అదే ఆ యువకుడికి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా ప్రేమించాలన్నా అడ్డు పడుతుంది.అమ్మాయిలు కనెక్ట్ అయ్యినా కూడా ఈ యువకుడు మాత్రం సారీ నువ్వు నాకు సోదరి అవుతావు అని చెబుతున్నాడు.

ఏ అమ్మాయి కనపడ్డా ఈమె నాకు సోదరి అవుతుందో ఏమో అని వారిని చూడడానికి కూడా భయపడుతున్నాడు.ఆ యువకుడి తండ్రి కుటుంబాన్ని పోషించడానికి వీర్యదానం చేసేవాడు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 సార్లు తన వీర్యాన్ని దానం చేసి ఎంతో మంది పిల్లలు లేక భాదపడుతున్న జంటలకు ఆనందాన్ని అందించాడు.ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో తన పిల్లలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆ త్తండ్రి ఆలోచించలేదు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

దీని కారణంగా ఆ యువకుడు ఎవరినీ ప్రేమించడం లేదు.తమ నగరంలో యువతులతో ఎవ్వరితోనూ డేటింగ్ చేయలేని పరిస్థితి వచ్చింది.

Advertisement

ఎవరినైనా ప్రేమిస్తే తన చెల్లికానీ అక్క వరస అయ్యే అమ్మాయితో పొరపాటునా శృంగారం చేస్తాడేమోనని భయపడుతున్నాడు.ఇందుకు ఒక సంఘటన ఉదాహరణగా చెబుతున్నాడు.

జావే తన చిన్న తనంలో స్కూల్లో తనతోపాటు చదువుకునే తన ఫ్రెండ్ డిఎంఏ రిజల్ట్ చూసి ఆశ్చర్యపోయాడట ఎందుకంటే తన స్నేహితుడు కూడా తన తండ్రి డిఎంఏ తోనే జన్మించాడట అప్పటి నుండి ప్రేమ విషయంలో కూడా ఇలానే జరిగితే పరిస్థితి ఏమిటని అందుకే తాను ఎవ్వరిని ప్రేమించాలన్న ముందు డి ఎం ఏ పరీక్ష చేయించిన తర్వాతే అని ఆ యువకుడు చెబుతున్నాడు.

తాజా వార్తలు